Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆరోగ్య తెలంగాణ నిర్మాణం లో ఆశా కార్యకర్తల పాత్ర కీలకం

ఆశా లను గుర్తించింది దేశంలో తెలంగాణ రాష్ట్రం మాత్రమే

కష్టపడితే కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని సీఎం కేసీఆర్ మరోసారి నిరూపించారు

సూర్యాపేట లో ఆశా కార్యకర్తలకు స్మార్త ఫోన్ ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

కరోనా నియంత్రణలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్​‍గా పనిచేసిన ఆశా వర్కర్‌ల సేవలు మరువలేనివని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.ఆశా కార్యకర్తలు జీతం కోసం గతంలో పోరాటాలు చేస్తే నాటి ప్రభుత్వాలు గుర్రాలతో తొక్కించాయని.. సీఎం కేసీఆర్ మాత్రం ఆశా కార్యకర్తల మనసు తెల్సుకుని జీతాలను రూ.9750కి పెంచారన్నారు.
ఆదివారం సూర్యాపేట లోని క్యాంపు కార్యాలయం ఆవరణలో ఆశా కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్‌ల పంపిణీ నీ మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా పరీక్షలు, గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు, తదితర సమాచారాన్ని పొందుపరుచడానికి ఆశా వర్కర్‌లకు స్మార్ట్ ఫోన్‌లను ఇవ్వడం అనేది వైద్య రంగం లో మంచి పరిణామం అన్నారు. సూర్యాపేట నియోజకవర్గం లో 330 మంది కి మంత్రి స్మార్ట్ ఫోన్ లు అందించగా, జిల్లా వ్యాప్తంగా 1070,
రాష్ట్ర వ్యాప్తంగా 27వేల మంది ఆశా కార్యకర్తలకు 4జీ సిమ్, స్మార్ట్ ఫోన్లు ఇవ్వబోతున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందజేయాలనే ఉద్దేశంతో స్మార్ట్ ఫోన్‌లను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. మరోవైపు ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచింది దేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే నని అన్నారు.
ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఆశా వర్కర్లలకు రూ.4వేలు వేతనమే ఇస్తున్నారన్న మంత్రి అదే తెలంగాణలో మాత్రం రూ.9,750 వేతనం ఇస్తున్నామని తెలిపారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 3వేలే ఇస్తున్నారన్నారు. తెలంగాణలో ప్రతి నెలా మొదటి వారంలోనే ఆశావర్కర్లలకు వేతనం అందిస్తున్నామని తెలిపారు. ఆశా కార్యకర్తల పనితీరును ప్రభుత్వం గుర్తించడం వల్లే వారికి స్మార్ట్ ఫోన్స్, సిమ్ కార్డులను పంపిణీ చేస్తోందని మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు.కరోనా కాలంలో ఆశా కార్యకర్తలు బాగా పనిచేశారని మంత్రి కొనియాడారు. ఆశా కార్యకర్తలు ప్రజలకు ఇంకా మెరుగైన వైద్య సేవలందించాలని ఆకాంక్షించారు. కష్టపడితే కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వేతనాలు పెంచడం ద్వారా మరోసారి తన మాటలను రుజువు చేశారన్నారు.
ప్రజారోగ్యంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్నామన్నారు. మోడీ, యోగి ప్రాతినిధ్యం వహించే ఉత్తర ప్రదేశ్ చివరి స్థానంలో ఉందని మంత్రి తెలిపారు. తెలంగాణ లో రాష్టాన్ని వైద్య రంగం లో ప్రపంచంలో నే నంబర్ వన్ స స్థానంలో నిలబెట్టేందుకు అందరం కృషి చేద్దామన్నారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ కొటాచలం, వైద్య అధికారి సుదర్శన్, పెన్ పహాడ్ ఎంపీపీ నెమ్మా ది బిక్షం, సూర్యాపేట జడ్పిటిసి జీడీ బిక్షం, వాంకుడోతు వెంకన్న, వైద్య అధికారులు పాల్గొన్నారు