మందిరం డెడికేషన్ కు 1,00116 డొనేషన్ చేసిన ఎమ్మెల్యే

తుంగతుర్తి ,శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్.

తుంగతుర్తి, ఫిబ్రవరి 20 నిజం న్యూస్

తుంగతుర్తి మండల వెలుగుపల్లి గ్రామంలో ఈ నెల 24వ తేదీన నూతన మందిరం డెడికేషన్ కార్య క్రమానికి నియోజక వర్గ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ గారిని ఆహ్వానించటం జరిగింది .డెడికేషన్ కార్య క్రమంలో నేను కూడా తప్పకుండ హాజరు అవుతాను అని చెప్పి మేము అడుగక ముందే తన వంతు సహాయంగా 1,00116 =00 /- (లక్ష నూట పదహారు రూపాయలు ) డొనేషన్ చెయ్యటం జరిగింది ….

 

దీనిలో భాగంగా గ్రామ అభివృద్ధిలో భాగంగా బరియల్ గ్రౌండ్ కు ప్రహరీ గోడ మరియు మన వూరు -మన బడి లో భాగంగా ప్రైమరీ స్కూల్ , హై స్కూల్ లను ”ఒక మోడల్ స్కూల్ ” వలె వుండే విదంగా తీర్చిదిద్దుదాము అని హామీ ఇవ్వడం జరిగింది ..!!

 

ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటి సభ్యులు ముద్దంశ్రీను ,కే.సతీష్ ,తిరుమల్ ,R .సతీష్ ,దయాకర్ ,నర్సింహా ,శోభన్ ,ప్రేమ్ , తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు మేడే రాజీవ్ సాగర్, పాల్గొనడం జరిగింది .. చర్చ్ ఉత్సవ కమిటీ సభ్యుల తరపున శాసన సభ్యులు గాదరి కిషోర్ కుమార్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ..