కరీంనగర్ లో తీగల వంతెన
బ్రిడ్జి నిర్మాణానికి 149 కోట్లు.. ఏదైనా ఖరీదైనదే. పిల్లర్లు లేకుండా వంతెన నిర్మాణం.
కరీంనగర్ ,ఫిబ్రవరి 20 నిజం న్యూస్
ఈ బ్రిడ్జ్ ను కరీంనగర్-గోదావరిఖని బైపాస్ రోడ్ మరియు సదాశివపల్లి(మానకొండూరు మండలం)ను కలుపుతూ మానేరు నదిపై నిర్మించారు. దీని పొడవు 500 మీటర్లు. నదిపై నిర్మించిన బ్రిడ్జ్,ను 149కోట్లతో నిర్మించారు. అప్రోచ్ రోడ్లకు 34కోట్లు కేటాయించారు. రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఏది ఏమైనా అభివృద్ధి చెందిన అమెరికా, చైనా ,రష్యా లలో ఉన్నట్లుగా తలిచే విధంగా, తెలంగాణలో కూడా ఇటువంటి భారీ నిర్మాణాలు ప్రభుత్వం చేపట్టడం గమనార్హం