చెల్లని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు

చెల్లని చెక్కులు పంపిణీ

 

*సంతకాలు చేయకుండా జారీ చేసిన కల్యాణలక్ష్మి,షాదిముబారాక్ చెక్కులు పంపిణీ*

 

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని తాశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం మేనేజర్ సంతకాలు చేయకుండా జారీచేసిన కల్యాణలక్ష్మి,షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు .

కోటీ నాలుగులక్షల రూపాయల చెందిన సుమారు ఎనభై చెక్కులపై ఎస్బీ.ఐ మేనేజర్ సంతకాలు చేయలేదు.

వాటిని చూడకుండా రెవెన్యూ అధికారులు ఆ చెక్కులను తీసుకువచ్చి ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేయడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది.

దీంతో శనివారం లబ్ధిదారులు పట్టణంలోని ఎస్బీ.ఐ కార్యాలయానికి వెళ్లగా ఈ చెక్కులు చెల్లవని, చెక్కుల్లో మేనేజర్ సంతకం లేదని లబ్ధిదారులను వెనక్కు తిరిగి పంపారు.

ఆడపిల్లల తల్లిదండ్రులకు అందించే కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు.