Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రేమ, పెళ్లి తో నయవంచన.. స్టేషన్లో ఫిర్యాదు

ప్రేమ, పెళ్లి తో నయవంచన చేస్తున్నాడని, బాధితురాలు స్టేషన్లో ఫిర్యాదు!

ప్రేమించి, పెళ్లి చేసుకొని, తల్లిదండ్రుల మాటలతో, ఎక్సైజ్ కానిస్టేబుల్ సతీష్, ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు రాధిక ఆవేదన.

సూర్యాపేట ఎస్పి న్యాయం చేయాలని, బాధితురాలి వేడుకోలు.

తుంగతుర్తి ఫిబ్రవరి 19 నిజం న్యూస్.

ప్రేమించుకొని, ఉద్యోగం వచ్చిన అనంతరం, మాట్లాడకుండా, ఇబ్బందులకు గురి చేయగా, గతంలో పోలీస్ స్టేషన్ కి వెళ్లి.. బాధలను చెప్పుకో గా, అతి కష్టంపై రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని, తిరిగి వివాహిత బోనగిరి రాధికను, ఇబ్బందులకు గురి చేస్తున్న ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వెలుగు సతీష్ పై శనివారం రోజు తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది…

బాధితురాలు రాధిక తెలిపిన వివరాల ప్రకారం, గత కొన్ని సంవత్సరాలుగా సతీష్ ,నన్ను ప్రేమించి, మోసం చేసి, ఉద్యోగం పొందిన అనంతరం తల్లిదండ్రులైన మాటలు నమ్మి, నన్ను దూరం చేశాడు. అనంతరం పెళ్లి చేసుకోవాలని గత రెండు సంవత్సరాల క్రితం, కుటుంబం పై పోరు చేయగా, మ్యారేజ్ చేసుకొని, హైదరాబాద్ కు తీసుకు వెళ్లి, కొన్ని రోజులు ఉంచి, తిరిగి మళ్ళీ కరివిరాల కు పంపినట్లు ఆమె తెలిపారు. శుక్రవారం రోజున సతీష్ తన ఇంటికి రాగా, రాధిక వెళ్లి, నన్ను కూడా హైదరాబాద్కు తీసుకువెళ్లాలని, కోరగా, కుటుంబ సభ్యులతో కలిసి దాడి చేసినట్లు, తలకు ,కాళ్లకు గాయాలు కాగా, రాధిక కుటుంబ సభ్యులు100 ఫోన్ చేయగా, తక్షణమే తుంగతుర్తి పోలీసులు స్పందించి, తీసుకొని వచ్చి, దవాఖానాల్లో చూపెట్టినట్లు ఆమె తెలిపారు

. ఏది ఏమైనా ఆధునిక ప్రపంచంలో ఇరువురు వ్యక్తుల ప్రేమించుకొని, పెళ్లిళ్లు చేసుకుని, సుఖ సంతోషాలతో జీవితాలు గడుపుతున్న తరుణములో, మంచి విద్యాభ్యాసం చేసిన రాధికకు ఉద్యోగం రాక పోవడం కారణమా??? తల్లిదండ్రులు మాటలకు సతీష్ వంట పలుకుతూ, ఇబ్బందులకు గురి చేయడంతో, నా జీవితం ఇంతేనా, నాకు ఎవరు న్యాయం సమాజములో చేస్త లేరు అని పోలీస్ స్టేషన్లో కన్నీటి పర్వతం మయం కావడం బాధాకరమైన విషయం. రాధిక ఫిర్యాదును స్వీకరించి, సూర్యాపేట ఎస్పీ జరుగుతున్న సంఘటన పై పూర్తి విచారణ జరిపి, సతీష్ అని ప్రత్యేకంగా విచారించి, రాధిక కు న్యాయం చేయాలని, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు.