మహిమగల పురాతన వెంకటేశ్వర దేవాలయం
కాకతీయుల కాలం నాటి 12వ శతాబ్దపు, దేవుని గుట్ట తండ గుట్టపై వెలసిన పురాతన రాతి ఆలయం.
ఆలయ మరమ్మతుల కోసం స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రత్యేక నిధులు కేటాయించాలని గిరిజనులు, మండల భక్తులు కోరుతున్నారు
తుంగతుర్తి, ఫిబ్రవరి 19 నిజం న్యూస్.
కాకతీయుల కాలం నాటి 12వ శతాబ్దపు , పురాతన ఆలయాల్లో, దేవుని గుట్ట తండా వద్ద గుట్టపై వెలసిన మహిమగల, వెంకటేశ్వర ఆలయం చెప్పుకోవచ్చు.
ఈ మధ్యకాలంలో వెంపటి కి చెందిన ఓ పురోహితుడు, కొద్ది రోజులు ఆలయంలో పూజలు నిర్వహించేవారు. ఈ గుడికి వచ్చిన భక్తులకు, సకల దోషాలు పోయి, కోరుకున్న భక్తుల కొంగు బంగారంగా మారినట్లు జరుగుతుండడంతో, ప్రస్తుతం ఆలయ పూజారి శ్రీకాంత్ నాయుడు, స్థానిక సర్పంచ్ గూగుల్ లోతు ఈరోజు, దేవుని గుట్ట తండా కు చెందిన గిరిజనులు, ఆలయానికి ఒక రూపు తెచ్చి, మండలంలోని భక్తులు ఆలయానికి రావడానికి, ప్రత్యేకంగా ఓ మట్టి రోడ్డును ఏర్పాటు చేశారు.
దీనితో ప్రతి శనివారం గుట్టపై వెలసిన, వెంకటేశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు సాగుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఏకంగా భక్తులు వాహనాలపై వస్తూ, తమ కోరికలు చెబుతుండగా, తమ కష్టాలు తీరినట్లే, భక్తులే ఏకంగా చెబుతున్నారు. ఈ పురాతన ఆలయం పూర్తిగా ఆనాడు రాయితో, అందమైన, శిల్పాలతో చెక్కి ఉండటం, వింతగా , అబ్బుర పరిచే విధంగా ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. పూర్తిగా సుమారు 50 ఎకరాల గుట్టపై, రాయితో, కాకతీయుల కాలం నాడు నిర్మించబడినట్లు తెలుస్తుంది. గుట్టపైన చిన్న కోనేరు కూడా ఉన్నది. ఏది ఏమైనా పురాతన వెంకటేశ్వర ఆలయం మరమ్మతులకు ప్రత్యేక నిధులు స్థానిక ప్రజా ప్రతినిధులు మంజూరు చేసినట్లయితే, మంచి దేవాలయంగా రూపుదిద్దుకోనున్న ట్లు నిజాం న్యూస్ తో భక్తులు, గిరిజనులు పేర్కొన్నారు