ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
గట్టమ్మ వద్ద ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి ములుగు ఫిబ్రవరి 19 నిజం న్యూస్ : ములుగు శివారులో గట్టమ్మ గుడి మూలమలుపు వద్ద ఆర్టిసి బస్సు, కారు ఢీకొన్న సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒక మహిళ, ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆర్టీసీ బస్సులోప్రయాణిస్తున్న భక్తులకు స్వల్పంగా గాయాలయ్యాయి.మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను మొక్కులు చెల్లించి తిరుగు ప్రయాణంలో ప్రమాదం జరిగి మృత్యువాత పడ్డారు.