మేడారం వెళ్ళొస్తూ.. గుండెపోటుతో, కుప్పకూలిన జర్నలిస్టు

మేడారం వెళ్ళొస్తూ.. గుండెపోటుతో, కుప్పకూలిన జర్నలిస్టు.

జర్నలిస్టు రాజమౌళి మృతికి ,పలువురి జర్నలిస్టుల సంతాపం.

వరంగల్, ఫిబ్రవరి 18 ,నిజం న్యూస్

హైదరాబాద్ ఉప్పల్ ఏరియాలో విలేఖరిగా పనిచేస్తున్న
పూసల రాజమౌళి శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఇతని వయసు 53 సంవత్సరాలు. స్వస్థలం బెల్లంపల్లి పట్టణం హనుమాన్ బస్తీ. రాజమౌళి మెట్రో ఈవెనింగ్ పత్రిక ఎడిటర్ దేవరకొండ కాళిదాసు బంధువు. హైదరాబాద్ లోని ఉప్పల్ డిపో వద్ద స్థిరపడ్డాడు. మూడేళ్ళుగా చాటింపు పత్రికలో రిపోర్టర్ గా పనిచేస్తున్న రాజమౌళి నిన్న చెన్నై కి వెళ్ళి తిరిగి వస్తూ పనిలోపనిగా మేడారం జాతరకు వెళ్ళి దర్శనం చేసుకున్నాడు. ఈ రోజు తెల్లవారు జామున హైదరాబాద్ కు తిరిగొస్తున్న సమయంలో కాజీపేట రైల్వేస్టేషన్ లో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నట్లు బంధువులు తెలిపారు. ఒక కొడుకు అమెరికాలో, మరో కొడుకు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. కాగా మూడు నెలల క్రితమే పెద్ద కొడుకు పెళ్ళి చేసి అమెరికాకు పంపారు. అంతలోనే ఇలా జరిగిపోవడం విషాదం. రాజమౌళి మృతిపట్ల తెలంగాణ రాష్ట్రంలోని పలువురు జర్నలిస్టులు ,తమ సంతాపాన్ని ,సానుభూతిని వ్యక్తం చేశారు.