పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం లో సీఎం నే మర్చిపోయిన అధికారులు
పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం లో సీఎం నే మర్చిపోయిన అధికారులు.
తుర్కపల్లి ఫిబ్రవరి 18(నిజం న్యూస్).
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఆగమాగం లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ నే మర్చిపోయారు.ప్రారంభోత్సవంలో ఎర్పాటు చేసిన స్టేజి లో సీఎం ఫోటోలు లేకుండానే మంత్రి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఫోటోలు కనిపిస్తున్నాయని పలువురు వాపోతున్నారు ఇలా అధికారాలు ప్రోటోకాల్ మర్చిపోతే ఎలా అని నాయకులూ వాపోతున్నారు.