Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

దేవాదాయ శాఖ భూములు స్వాహా

ప్రజలకు నకిలీ పట్టాలు అందించిన అధికారులు ఎవరు..?

*తీగలాగితే డొంక కదిలింది*

*దేవాదాయ శాఖ భూములు స్వాహా*

*ప్రజలకు నకిలీ పట్టాలు అందించిన అధికారులు ఎవరు..?*

*గ్రామ పంచాయతీ లే అవుట్ లో చూపిన 21 ఒక్క ఖాళీ ప్లాట్లు మాయం*

*ఎప్పటికప్పుడు అధికారం లో ఉన్న పార్టీలను అడ్డం పెట్టుకొని మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడేవరు…?*

సూర్యాపేట జిల్లా ఆనంతగిరి మండలపరిధిలోని వెంకట్రామాపురం గ్రామంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని పేద కుటుంబలవారందరికీ ఇల్లు కట్టించాలనే ఉద్దేశం తో ప్రవేశ పెట్టిన పథకం ఇందిరమ్మ పథకం, ఇందిరమ్మ పథకంలో ఆర్వ్హులైన వారందరికీ ఆనంతగిరి,కి చెందిన దేవుని మన్యం నుంచి వెంకట్రామాపురం గ్రామ శివారులో రెవిన్యూ పరిధిలో దేవాదాయ శాఖ,కు సంభందించిన సర్వే నెంబర్: 1024/2, నుంచి మూడు ఎకరాల ముప్పయి రెండు కుంటలు, సర్వే నెంబర్ : 1025/2 నుంచి ఒక ఎకరం ఇరవై ఎనిమిది కుంటల భూమిని అప్పటి కాంగ్రెస్ హయాంలో తీసుకుని ఇందిరమ్మ కాలనీ ఏర్పాటు చేశారు, గ్రామ పంచాయతీ లేఅవుట్ ప్రకారం, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటర్ ట్యాంక్, అంగన్ వాడి కేంద్రం, కమ్యూనిటీ హల్,గ్రంధాలయం, పశువుల హాస్పిటల్స్ కోసం ప్రజల సౌకర్యాల నిమిత్తం ఇరవై ఒకటి ప్లాట్లును అప్పటి అధికారులు ఏర్పాటు చేసినట్టు మ్యుప్ లో ఉంది, కానీ భూమి లేదు రెండు వేల ఎనిమిదిలో ఏర్పడిన ఇందిరమ్మ కాలని అంటే ఇప్పటికి 14, సంవత్సరాలు కవస్తోన్న ఇప్పటి వరకు పైన పేర్కొన్న ఎవక్కటి పాలకులు, కానీ అధికారులు కానీ అమల్లోకి తేలేదు, ప్రజల అవసరాల నిమిత్తం తీసిన ఇరవై ఒక్క ప్లాట్లు కూడా మాయం అయ్యాయి అని అంటున్నారు స్థానికులు, ఈ తతంగమంత గ్రామంలో టిఆర్ యస్ పార్టీ ఓ నాయకుడు అవినీతికి పాల్పడట్టు సమాచారం, ఇందిరమ్మ కాలని వెంకట్రామాపురం, గ్రామానికి దూరంగా ఉండడం వలన మిషన్ భగీరథ నీరు కాలనీకి వచ్చే సౌకర్యం లేక ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాటర్ ట్యాంక్ ఏర్పాటు ఈ క్రమంలో స్థలం సేకరించేందుకు కాలనికి వచ్చిన అధికరులు
ఖాళీ స్థలం లేక పోవడంతో చేసేది ఏమిలేక అధికారులు వెళ్ళిపోయారని అని స్థానికులు చెబుతున్నారు, ఈప్పటికైనా అధికారులు ప్రజల సౌకర్యాల కోసం కేటాయించిన స్థలాలు గుర్తించి కాపాడి కబ్జా చేసిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు అంటున్నారు,

*జేబులు నింపుకొని అనర్హులకు ఇందిరమ్మ ఇడ్ల స్థలాలు కేటాయంపు*

ఇందిరమ్మ ఇండ్ల స్థలాలల కేటాయింపులో ఎన్నో అవకతవకలు జరిగాయి, ఆర్వ్హులైన వారికి కాకుండా అప్పుడు అధికారంలో ఉన్న నాయకులు గ్రామానికి చెందిన వారికి కాకుండా కాసులకు కక్కుర్తి పడి స్థానికులకు ఇవ్వకుండా వేరు, వేరు, మండలాలకు చెందిన గుర్తు తెలియని కొంత మంది వ్యక్తులకు ఇండ్ల స్థలాలు ఇచ్చి అప్పటి నాయకులు జేబులు నింపుకున్నారని, వెంకట్రామాపురం, స్థానికప్రజలు తెలిపారు, లబ్ధిదారులకు కనీస ఆర్వ్హత పరిగనం లోకి తీసుకోకుండా ప్రభుత్వ నిబంధనలు పాటించాకుండా గ్రామానికి చెందిన కొందరు నాయకులు పెత్తనం చేస్తూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతూ వారి తప్పులను కప్పిపుచ్చుకుంటు ప్రజల సొమ్మును కాజేస్తూ అధికార పార్టీ నాయకులకు దెగ్గరగా వుంటూ బడా నాయకులకు చేరఅవుతూ అధికార పార్టీలను అడ్డం పెట్టుకొని గ్రామ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు, ప్రస్తుతం ఓ అధికార పార్టీ నాయకుడిగా గుర్తింపు.

*అమ్మకానికి పెట్టిన ఇందిరమ్మ ఇల్లులు*

ఇందిరమ్మ ఇల్లు అమ్మరాదు కొనరాదు అమ్మిన కొన్న ప్రభుత్వ నిబంధనల ప్రకారం చట్టరీత్య నేరం లబ్ధిదారులకు ఇచ్చిన పట్టా మీద రాశివున్న కూడా ప్రభుత్వ నిబంధనలు మాకు వర్తిచావు అనుకుంటున్నారేమో వీరు మధ్య వర్తుల ద్వారా ఖాళీ ప్లేస్ లక్షల్లో అమ్ముకుంటున్నారు, మరి కొందరు మేమే నాయకులం, పెద్దమనుషులం అంటూ ఇదే అదునుగా అమాయకులను మోసం చేస్తూ తక్కువ ధరకు ఇందిరమ్మ ఇండ్ల స్థలాలు ఓ రాజకీయ నాయకుని హయం లో ఇచ్చిన ఆదే నాయకుడు ఇప్పుడు మధ్యవర్తిగా ఉంటూ తను అమ్మడం గమనార్హం, ఇందిరమ్మ కాలని అనర్హులకు ఇవ్వడం వలన స్థానికుల వివరాల ప్రకారం యాబై శాతం వరకు ఇల్లులు చేతులు మారాయి,

*ప్రజలకు నకిలీ పట్టాలు అందించిన అధికారులు ఎవరు..?*

ఇందిరమ్మ కాలనీ వివరాలకై వెంకట్రామాపురం, గ్రామ ప్రజల వివరాలు సేకరించగా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మొదటి విడతగా కొంత మందికి రెండో విడతగా మరికొందరికి మూడో విడతగా మొత్తం మూడు విడతలుగా లబ్ధిదారులకు గ్రామంలో ఓ రాజకీయకుడు వారికి ఇచ్చిన ఇంటి పట్టాల జిరాక్స్ లు ఉన్నట్టు లబ్ధిదారులు తెలిపారు, గ్రామ పంచాయతీ లే అవుట్ ప్రకారం గ్రామ పంచాయతీ,కి ఇరవై ఒక్క ప్లాట్లు ఇవ్వగా
మిగతా మొత్తం నూట అరవై ఆరు ప్లాట్లులో

మూడో విడతలో వచ్చిన ఎనబై ఆరు ప్లాట్లకు సంబంధించిన వివరాల కోసం మండల రెవిన్యూ ఆపిసులో సంప్రదించగా అసలు వాస్తవాలు బయట పడ్డాయి, ఎనబై ఆరు ఇళ్లకు సంభందించిన ఎటువంటి ఆధారాలు లేవని రెండు విడతాలకు సంభందించిన వివరాలు మాత్రమే రెవిన్యూ అధికారులు ఉన్నాయన్నారు మూడో విడత లో ఎనబై ఆరు మందికి ఇచ్చిన నకిలీ జిరాక్స్ పట్టాలుగా తేల్చి చెప్పిన అధికారులు
విషయం తెలుసుకున్న మూడోవిడత ఇందిరమ్మ కాలనీ లబ్ధిదారులు భయనందోనలు చెందుతున్నారు,
నకిలీ జిరాక్స్ పట్టాలు అందించిన అధికారులు ఎవరు ?
ఎవరి హయాంలో ఎప్పుడు అవినీతి జరిగింది,అనే విషయాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి అవినీతికి పాల్పడిన వారి పై ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుంటరా ! లేదా అనేది వేచిచూడాలి ఇంత తతంగం జరుగుతున్న అధికారులు కన్నెత్తి కూడా చూడక పోవడం కొసమెరుపు.