టిఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు

టిఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు.

తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్.

తుంగతుర్తి, ఫిబ్రవరి 18 నిజం న్యూస్

తిరుమలగిరి పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో శుక్రవారం రోజున తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ కొండగడుపుల వినోద సైదులు,వార్డు మెంబర్ సరిత అంద్రయ్య, మాజీ వార్డు మెంబర్ జీడీ అరుణ,శాంతయ్య,వీరయ్య,కృష్ణ, నర్సింహ వారితో పాటు 50 మంది నాయకులు, టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ,వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు నేడు *తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ గారి* సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది.నూతనంగా TRS పార్టీలోకి చేరిన వారిని గులాబీ కండువాలు కప్పి ,పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు .ప్రతి ఒక్కరిని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మున్సిపల్ చైర్ పర్సన్ రాజాని, ఎంపీటీసీ చెరుకు సుజనా పరమేష్, ఇతరులు పాల్గొన్నారు