పథకాలన్నింటిలో కెసిఆర్ ముద్ర
విజయవంతం చేయడంలో నిరంతర శ్రమ
పథకాలతో ప్రజలకు ఆదర్శంగా పాలన
హైదరాబాద్,ఫిబ్రవరి17(ఆర్‌ఎన్‌ఎ): రైతులకు జీవితబీమా పథకం అన్నది ఓ గొప్ప ఆలోచన. దానిని అమలు చేస్తే రైతులకు ఇక ఆత్మహత్యల శరణ్యం రాదు. ఇప్పటికే అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తరుణంలో ఈ పథకం గొప్ప వరంగా భావించాలి.
అనేక ఆశలు, ఆశయాలతో, అమరుల త్యాగాలతో పురుడుపోసుకున్న తెలంగాణను అభివృద్థిపథంలో తీసుకెళ్లేందుకు కెసిఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నతీరు ఇప్పుడు దేశానికి దిక్సూచి అనేలా ముందుకు సాగుతున్నారు. ఆనేక కార్యక్రమాల్లో రైతాంగ సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలే విప్లవాత్మకంగా నిలవనున్నారు.
రైతులు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వ్యవసాయం చేసుకుని బంగారు పంటలు పండిరచేలా రైతులకు సకల హంగులు సమకూరుస్తున్న తీరు దేశవ్యాప్తంగా ఆకర్శితమవుతోంది. తాజాగా రాష్ట్రంలోని 18 నుంచి 60 ఏళ్ల వయస్సున్న ప్రతి రైతుకు రూ.5 లక్షల జీవితబీమా పథకం నిర్వహణకు అనుమతిస్తూ మంత్రిమండలి తీర్మానించింది.
వ్యవసాయరంగం అభివృద్ధి కోసం రైతుబంధు పథకం ప్రారంభించి ఎకరానికి నాలుగువేలు పెట్టుబడి సాయం అందించడంతోపాటు ఆగస్టు నుంచి రైతుబీమా పథకాన్ని అమలు చేయనున్నాన్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఈ నాలుగేళ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాలను, అమలువుతున్న తీరును ప్రజల్లోకి గట్టిగా తీసుకుని వెళ్లేలా కార్యాచరణకు సిద్దం అవుతున్నారు.
తెలంగాణలో రైతులకు, ప్రజలకు నమ్మకం భరోసా కల్పించడంలో సీఎం కేసీఆర్ విజయం సాధించారనే చెప్పాలి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఇతర రాష్టాల్రను ఆకర్షిస్తున్నాయని నేతలు పదేపదే అంటున్నారు. కేసీఆర్ తీసుకున్న ప్రతి పథకం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నదని, త్వరలోనే జాతీయస్థాయిలో అన్ని పార్టీలకు ఇవే మ్యానిఫెస్టోలు కానున్నాయని తెలిపారు.
కరువులేని రాష్ట్రంగా మార్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారని తెలిపారు. గత నాలుగేళ్లలో అనేకానేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపదించిన గులాబీనేత కెసిఆర్ కూడా తన అభివృద్ది మంత్రాన్ని ప్రజలకు వివరించనున్నారు. ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టిన జిల్లాల పునర్విభజన, పింఛన్లు`జీవనభృతి, మైనారిటీ సంక్షేమం, మౌలికవసతుల కల్పన, రైతుబంధు, రైతుబీమా, ప్రాజెక్టుల నిర్మాణం, విద్యావైద్యంపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారంలో ఉన్నవే.
సీఎం కేసీఆర్ ఏడేండ్లుగా అనేక విజయాలు సాధించారు. పది జిల్లాల తెలంగాణను 31 జిల్లాలుగా విభజిస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో పాలన ప్రజలకు చేరువైంది. జిల్లా కేంద్రాలు కూతవేటు దేరంలోకి వచ్చాయి. ఇకపోతే మంచినీటికోసం మిషన్ భగీరథ, సాగునీటి కోసం మిషన్ కాకతీయ, 24 గంటల విద్యుత్ సౌకర్యం వంటివి విజయవంతంగా అమలు జరుగుతన్నాయి.
వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, వికలాంగులు ఇలా అందరికీ పింఛన్ అందిస్తున్న తీరు కూడా ఆసారగా నిలిచింది. గతంలో నిరంతర కోతలు తప్ప విద్యుత్ ఉండేది కాదు. ఇప్పుడు ఎక్కడా కోతలు అన్న పదానికి తావు లేకుండా చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దే. ఇది ఎవరూ కాదనలేని నిజం. మనకు అనుభవంలో ఉన్న సత్యం. పారిశ్రామిక వేత్తలు కూడా దీనిని అంగీకరిస్తున్నారు.
ఇక మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల అధ్యయనం కోసం ఇక్కడికి వివిధ రాష్టాల్ర అధికారులు వస్తున్నారంటే అవి ఎంతగా ప్రాచుర్యం పొందాయో చెప్పకరలేదు. సుపరిపాలన దిశగా సుస్థిర పాలన అందించటం క్లిష్టమైనదే కాకుండా కష్టసాధ్యమైనది కూడా. రాష్ట్ర ఏర్పాటుకు పోరాడడం ఒక ఎత్తయితే, సుస్థిరాభివృద్ధికి సుపరిపాలన ఎంతో అవసరం.
ఆ దిశగా వేస్తున్న అడుగులు సహజంగానే ఇతరులకు పెద్దగా కనిపించకపోవచ్చు. అవి అడుగులే కాదనే వారు ఉంటారు.కానీ కెసిఆర్ మాత్రం ఒక్క అడుగే వేల కిలోవిూటర్ల ప్రయాణానికి పునాది అంటారు. అందుకే తాను నమ్ముకున్న బాటలో సాగడానికి ఆయన విమర్శలను పక్కన పెట్టారు. అందుకే అచిర కాలంలోనే దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాల రూపకల్పనలో తనదైన ముద్రను వేశారు.