సాండ్ అనిమేషన్ ఆర్ట్ తో సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు

– తుంగతుర్తి, ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్.
హైదరాబాద్, ఫిబ్రవరి 17 నిజం న్యూస్
తెలంగాణ జాతిపిత రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ పట్టణంలోని కళింగ భవన్ లో తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాండ్ అనిమేషన్ ఆర్ట్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రారంభించారు.
సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం జీవితంలో అనేక త్యాగాలు చేశారని జగదీష్ రెడ్డి చెప్పారు. ప్రాణాలకు సైతం తెగించి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని.. అదే తెగింపుతో దేశ ప్రజల కోసం పోరాటం చేస్తారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే సీఎం కేసీఆర్ ఆయు ఆరోగ్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ జీవితం భవిష్యత్ తరాలకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జీవిత ప్రస్థానం ఇతివృత్తంగా సాండ్ యానిమేషన్ ఆర్ట్ ఆకట్టుకుంది.జననం,విద్యాభ్యాసం ,రాజకీయ ప్రస్థావం, తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్రం, ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్, సంక్షేమ పథకాలు, దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ చిత్ర రూపంలో సాండ్ అనిమేషన్ ఆర్టిస్ట్, సుధాకాంత్ గారు అద్భుతంగా చిత్రీకరించారు.
ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి సభ్యులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, డైరెక్టర్ ఎన్.శంకర్, ప్రొపెసర్ శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నంద్యాల దయాకర్ రెడ్డి, గుజ్జ యుగేందర్ రావు, ధర్మేంధర్ రెడ్డి, పల్లా ప్రవీణ్ రెడ్డి, సుధాకర్, గోపాల్ టిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు గుండ గాని కిరణ్ గౌడ్,వల్లమల్ల కృష్ణ, పడాల సతీష్, జిల్లా శంకర్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు