అంగరంగ వైభవంగా తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణం 

కృష్ణా, ఫిబ్రవరి 16, నిజం న్యూస్
శ్రీ తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణం పెనుగంచిప్రోలు లో బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసన సభ్యులు సామినేని ఉదయభాను దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణాలు కిక్కిరిసాయి. భక్తులకు అన్నదాన ఏర్పాట్లు, కోవిడ్ నిబంధనలను అనుసరించి ఎలాంటి అవంతరాలు జరగకుండా పోలీసు వారు చర్యలు తీసుకున్నారు.ఈ కార్యక్రమం లో పాలక మండలి చైర్మన్ ఇంజం చెన్నకేశవరావు, పాలకమండలి సభ్యులు కార్యనిర్వహణ అధికారి కె. శోభారాణి, మండల పరిషత్ అధ్యక్షులు మార్కపూడి గాంధీ గ్రామ సర్పంచ్ శ్రీమతి వేల్పుల పద్మ కుమారి, జడ్పిటిసి ఊట్ల నాగమణి అంతేకాక అన్ని గ్రామాల సర్పంచులు, పలువురు నాయకులు అధికారులు పాల్గొన్నారు.