Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గిరిజనుల ఆశాదీపం సేవాలాల్ మహారాజ్-గొంగిడి సునీత

తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత అన్ని జాతులు, వర్గాలను గౌరవించి, వారి సంస్కృతిని పెంపొందించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని చర్యలు చేపట్టారని ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు శ్రీమతి గొంగిడి సునీతా మహేందర్రెడ్డి తెలిపారు.

బుధవారం నాడు శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 283 వ జయంతి వేడుకలను ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్ గ్రామం దాదా దేవ్ దేవాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, గిరిజన సోదరులందరికీ సంత్ సేవాలాల్ మహారాజ్ వారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం సాధించాక ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంత్ సేవాలాల్ గారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని జాతులను,వర్గాలను గౌరవిస్తూ వారి సంస్కృతిని పెంపొందించడంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ నిధులు కేటాయిస్తున్నారని అన్నారు.

గిరిజనుల ఆశాదీపం సేవాలాల్ మహారాజ్ అని అన్నారు.సంత్ సేవాలాల్ వారి దీవెనలు అందరికీ ఉన్నాయని, ఆయన చూపిన మార్గంలో తప్పనిసరిగా నడవాలని, దురలవాట్లకు దూరం వుండి, మంచి అలవాట్లతో తమ తోటి వారిలో మార్పు తీసుకురావాలనేదే సంత్ సేవాలాల్ వారి కోరిక అని,అందరూ సేవాలాల్ పేరు నిలపాలని,వారి మార్గంలో పయనించాలని అన్నారు.

సంత్ సేవాలాల్ బోధనలతో ప్రజలలో మార్పు వస్తున్నందున, అతనిని చంపాలని మొగల్ రాజు పంపిన మిఠాయిలను సంత్ సేవాలాల్ గమనించి దానిలో ఉన్న విషాన్ని హరించి మొగల్ రాజులో పరివర్తన తెచ్చిన మహనీయుడు సంత్ సేవాలాల్ అని కొనియాడారు. బంజారా సోదరులలో చాలా నైపుణ్యం,ప్రతిభ ఉందని, కష్టపడతారని,చిత్తశుద్ధితో పని చేస్తారని,అయినా కూడా వారు వెనకబడి పోయారని, విద్య లేకనే వారు అలా వెనకబడి పోయారని, ఈ విషయాన్ని గమనించి అందరూ విద్యతో రాణించాలని,సేవాలాల్ ఆశీర్వాదంతో గిరిజన జాతి అభివృద్ధిలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

సంత్ సేవాలాల్ దేవాలయం కోసం స్థలం పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. ఉత్సవ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్ భికూ నాయక్,జడ్పిటిసి శ్రీమతి అనురాధ,మండల ప్రజా పరిషత్ సభ్యులు శ్రీశైలం, భూక్యా సుశీల, జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మంగ్తా నాయక్,జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి భూక్యానాయక్,ఉత్సవ కమిటీ చైర్మన్ భూక్య రవి,సర్పంచ్ వెంకటయ్య, ప్రజా ప్రతినిధులు,గిరిజన ప్రతినిధులు పాల్గొన్నారు.