Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రాజకీయ అవినీతిపై తక్షణం చర్చించాలి !


దేశం అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. ప్రజలు అన్ని రకాలుగా అవస్థలు పడుతున్నారు. కరోనా తగ్గు ముఖం పడుతున్నదన్న ఒక్క శుభ సంకేతం తప్ప వారికి ఎలాంటి ఆనందం లేదు. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు పరస్పర విమర్శలు, రాజకీయ దూషణలతో కాలం గడుపుతూ..ఆనందిస్తున్నారు. ఎవరిని ఎవరు బాగా విమర్శించారన్నదే లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రజలకు ఏ మాత్రం సబంధం లేని అంశాలు..దేశ భద్రతకు సంబంధించిన అంశాలు కూడా ఇందులో చోటుచేసుకుంటున్నాయి. నిజానికి రాజకీయ నాయకులకు చిత్తశుద్ది ఉంటే….ప్రజలపై ప్రేమ ఉంటే వారు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించాలి. దేశవ్యాప్తంగా సమస్యలపై చర్చించాలి. మోడీ పాలనపైనా..ఆయన తీసుకున్న నిర్ణయాలపైనా..ప్రజలకు వాటి వల్ల కలిగిన లాభనష్టాల పైనా హుందాగా చర్చించాలి. అలాగే తెలుగు రాష్టాల్రతో పాటు ఆయా రాష్టాల్ల్రో ప్రజలు ఎదర్కొంటున్న సమస్యలను, పాలకుల తీరును చర్చించాలి. దీనివల్ల ప్రయోజనం ఉండగలదు. ప్రజలకు కూడా ఎవరేమిటో తెలుస్తుంది. అంతేగానీ సర్జికల్‌ స్టయ్రిక్స్‌..చైనా దాడుల గురించి కాదు. ఇది మన అంతరంగిక సమస్య.. దీనిని చర్చించడం..విమర్శించడం వల్ల ప్రపంచంలో మన పరువే పోతుంది. కనుక ఇలాంటి సమస్యలను పక్కన పెట్టి విద్య, వైద్యం, మంచినీటి సరఫరా, విద్యుత్‌, నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం, పన్నుల వడ్డింపులు గృహనిర్మాణం తదితర సమస్యలపై చర్చించాలి. పెరుగుతన్న ధరలను చర్చించాలి. రైతులకు గిట్టుబాటు ధరలు ఎందుకు చెల్లించడం లేదో చర్చించాలి. అవినీతిపైనా చర్చించాలి. ఉద్యోగుల అవినీతితో పాటు రాజకీయ నాయకుల అవినీతిపై పెద్దగా చర్చించాలి. వారి ఆస్తులను వెల్లడిరచాలి. గుప్త ఆస్తుల వివరాలు బయటకు తెప్పించాలి. రాజకీయ నాయకులు కోట్లకు పడగలెత్తిన తీరు కళ్లకు కనిపిస్తోంది. కబ్జాలు చేయడం..కవిూషన్లు పొందడం..వేలకోట్లు కూడబెట్టడం యధావిధిగా సాగుతోంది. ఇది క్షమించరాని విషయం. దీనిపై ప్రధానంగా చర్చించాలి. అదే ఇప్పుడు అవసరం తప్ప సర్జికల్‌ స్టయ్రిక్స్‌ జరిగాయా కాదా అన్నది కాదు. భారత సైన్యం ధైర్యసాహసాలను కానీ, శక్తి పాటవాలను కానీ ఎవరూ శంకించడానికి లేదు. వారి మనో ధైర్యం దెబ్బతీసే వ్యాఖ్యలు సరికాదు. భారత్‌కు పాక్‌ ఓ లెక్క కాదు. అలాగే చైనాతోనూ యుద్దం చేయగల సత్తా ఉందని దివంగత సైనికదళాల చీఫ్‌ బిపిన్‌ రావత్‌ పదేపదే చెప్పారు. సైనిక నియంతృత్వ దేశాలలో మినహాయిస్తే, దాదాపుగా అన్ని దేశాలలోనూ సైన్యం ప్రభుత్వం అధీనంలోనే ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశాలకు అనుగుణంగా సాయుధ బలగాలు వ్యవహరి స్తాయి. పాక్‌పై దాడికి అభినవ్‌ భింద్రా ఉదంతమే ఇందుకు నిదర్శనం. ఇకపోతే బిజెపి కూడా ప్రజల పక్షాన నిలబడడం నేర్చుకోవాలి. ప్రతిదీ విమర్శలు చేయడం.. ఎదురుదాడికి దిగి తప్పించుకోవడం కూడా సరికాదు. ఒక ప్రతిపక్ష నాయకుడి పుట్టుక గురించి నిందాపూర్వకంగా మాట్లాడడం అసోం సిఎం బిశ్వశర్మ సంకుచిత రాజకీయ మనస్తత్వాన్ని గుర్తు చేసింది. మన రాజకీయ విమర్శల్లో కుసంస్కారాన్ని సూచిస్తుంది. ఇకపోతే కొన్ని రోజులుగా తెలంగాణలో కరెంటు విూటర్ల రాజకీయం హీటెక్కింది. ఈ ఇష్యూపై కేసీఆర్‌, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలాయి. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది కేంద్ర సర్కార్‌. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలపై స్పందించింది కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ. కేంద్రమంత్రి ఆర్‌.కె.సింగ్‌ పేరుతో ప్రకటన విడుదల చేసింది. ఇటీవల జనగామ, భువనగిరి లో నిర్వహించిన బహిరంగసభల్లో కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు సీఎం కేసీఆర్‌. విద్యుత్‌ సంస్కరణల్లో భాగంగా కేంద్రం వ్యసాయ బోర్లు, బావుల మోటార్లకు విూటర్లు పెట్టాలని, మెడపై కత్తి పెట్టిందని ఆరోపించారు. అయితే, కేసీఆర్‌ ఆరోపణలు కేంద్ర విద్యుత్‌ శాఖ ఖండిరచింది. వ్యవసాయ బోర్లు, బావుల వద్ద మోటార్లకు విద్యుత్‌ విూటర్లు పెట్టాలని రాష్టాల్ర
ను బలవంతం చేయట్లేదని స్పష్టం చేసింది. పునరుత్పాదక ఇంధన వినియోగానికి సంబంధించి ఏ రాష్ట్రం పైనా ఇప్పటి వరకు ఒత్తిడి చేయలేదని తెలిపింది. సౌర విద్యుత్‌ కొనుగోలుకు రాష్టాల్రను బలవంతం చేయట్లేదని, విద్యుత్‌ కొనుగోలు వ్యవహారాలన్నీ ఓపెన్‌ బిడ్ల ద్వారానే జరుగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. ఆయా రాష్టాల్రు విద్యుత్‌ అవసరాలకు అనుగుణంగా కొనుగోలు చేస్తాయని, ఇదంతా బహిరంగం గానే జరుగుతుందని తెలిపింది కేంద్రం. ఇందులో ఎలాంటి దాపరికం లేదని స్పష్టం చేసింది. సీఎం స్థాయి లో ఉన్న వ్యక్తి అపోహలు, అవాస్తవాలు మాట్లాడటం సరికాదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఇందులో ఎవరు నిజమన్నది తేలాలి. కెసిఆర్‌ చూపిన డాక్యుమెంట్‌ నిజమా లేక కేంద్రం ఇచ్చిన సమాధానం నిజమా అన్నది ప్రజలకు తెలియచేయాలి. ఇలా ఎవరికివారు పరస్పర విమర్శలతో రాజకీయం గా లబ్దిపొందాలను కోవడం సరికాదు. కెసిఆర్‌ కేంద్రంపై యుద్దం ప్రకటించగానే అన్ని ప్రాంతీయ పార్టీల నేతలు మెల్లగా మద్దతు తెలుపుతూ..ముందుకు సాగండి అన్న ప్రోత్సాహం ఇస్తున్నారు. అయితే వీరంతా కలసి పోరాడా ల్సింది బిజెపిపై కాదు..ముందుగా సమస్యలపై.. అవి రాష్ట్రంలో ఉన్నవైనా లేక కేంద్రంలో ఉన్నవైనా.. అధికారమే లక్ష్యంగా లేదా అధికారం నిలపుకునే ప్రయత్నం చేయడం కోసం అయితే సరికాదు. ఇలా ఇంకెంతో కాలం రాజకీయాలు చేయడం మానుకోవాలి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విభజన రాజకీయాలంటూ ప్రజలను బురిడీ కొట్టించరాదు. బిజెపి ప్రజల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నది నిజం. అలాగే ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న రాష్టాల్ల్రో కూడా ఇంచుమించి ఇవే పరిస్థితులు ఉన్నాయి. ముందుగా ఇంటగెలిచి రచ్చ గెలవాలి. రాష్టాల్ల్రో సమస్యలపై ప్రజల ఆందోళన లకు సమాధానం ఇవ్వాలి. మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ సిఎం కెసిఆర్‌ పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దేశంలో మత తత్వానికి వ్యతిరేకంగా పోరాడు తున్నందుకు సిఎం కెసిఆర్‌ను అభినందిం చారు. మతతత్వశక్తుల విూద అద్భుతంగా పోరాడుతున్నారని అంటూ ప్రశంసలు గుప్పించారు. నిజానికి మతత్వానికి దేవేగౌడ నిర్వచనం ఏంటో చెప్పాలి. దేశ లౌకికవాద సంస్కృతిని, దేశాన్ని కాపాడుకునేందుకు విూమందరం విూకు అండగా ఉంటాం… విూ యుద్దాన్ని కొనసాగించండి.. మా సంపూర్ణమద్దతు విూకు ఉంటుం దని అంటూ దేవగౌడ తన మద్దతును ప్రకటించారు. లౌకికవాద సంస్కృతిపై ముందు స్పష్టత కూడా రావాలి. కేంద్రంపై యుద్దం చేయాలనుకుంటున్న వారంతా గతంలో తాము ఏం చేశామో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారో ప్రజల నుంచి వచ్చే విమర్శల ద్వారా తెలుసుకోవాలి. అలా చేయకుండా కేవలం కేంద్రంపై పోరాడితే ప్రజల మద్దతు కూడగట్టలేరి గుర్తించాలి. అవినీతి రాజకీయాలు, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు..చట్టాల ఉల్లంఘన తదితర అంశాలన్నింటినీ చర్చించడం ద్వారా ప్రలజను చైతన్యపరిస్తే మంచిది.