అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం
రేవంత్ రెడ్డి అరెస్టుపై భగ్గుమన్న కాంగ్రెస్ నాయకులు
అస్సాం ముఖ్యమంత్రిని వెంటనే అరెస్టు చేయాలి: ఎన్ఎస్ యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుర చందన రెడ్డి.
హైదరాబాద్ ఫిబ్రవరి16(నిజం న్యూస్):సోనియాగాంధీ పై నీచమైన వ్యాఖ్యలు చేసి, స్త్రీమూర్తులను అవమానిస్తూ అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ చేసిన కీచక కామెంట్లపై అస్సాం సీఎం పై కేసు నమోదు చేయాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశానుసారం కమిషనరేట్ ముట్టడి , చేసి నిరసన తెలిపే భాగంలో ముందుగా హౌస్ అరెస్ట్ లు చేస్తున్న వైనాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ,స్త్రీ జాతిని అవమానించిన అస్సాం సీఎం హేమంత్ బిస్వా శర్మ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి పిలుపు మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ముట్టడించిన ఎన్ఎస్ యుఐ రాష్ట నాయకులను హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ వద్ద అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది.