మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు ప్రారంభం

మేడారంకు హెలికాప్టర్ సేవలు ప్రారంభం!

హైదరాబాద్ ఫిబ్రవరి 15 నిజం న్యూస్.

హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో మంగళవారం రోజున మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన బ్రోచరును అవిష్కరించి, జాతర కోసం హెలికాప్టర్ సేవలను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మరియు తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ. ఉప్పల శ్రీనివాస్ గుప్త …ఈ సందర్భంగా.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు టూరిజం చైర్మన్ గారు, మరియు టూరిజం MD గారు టూరిజం ఇతర అధికారులు తో కలిసి పాల్గొని, జెండా ఊపి ప్రారంభించడం జరిగింది.ఆ తర్వాత ఈ సందర్భంగా హెలికాప్టర్ లో ఎక్కి ఒక ట్రిప్ (ఫస్ట్ రౌండ్ )ప్రయణం చేయడం జరిగింది.

మేడారంకు హెలికాప్టర్ సేవలు;* తేదీ: 14 ఫిబ్రవరి 2022 నుండి 20 ఫిబ్రవరి 2022 వరకు. అందించనున్నారు.

హెలికాప్టర్ జాయ్ రైడ్:* 7,8 నిమిషాలు మేడారం నుండి మేడారం రూ.3700/ – ఛార్జ్.

*మేడారం షటిల్ సర్వీస్:* రైడ్ 20 నిమిషాల వన్ వే

హన్మకొండ నుండి మేడారం షటిల్ సర్వీస్ ఒక్క వ్యక్తి కి రూ.19.999/-

*హెలికాప్టర్ చార్టర్ సర్వీస్;*

కరీంనగర్ నుంచి మేడారం రూ.75,000/- ప్రతి వ్యక్తికి

హైదరాబాద్ నుండి మేడారం కు ప్రతి వ్యక్తికి రూ.75.000/-

మహబూబ్ నగర్ నుండి మేడారం కు ప్రతి వ్యక్తికి

రూ.100.000/- గా నిర్ణయించారు.

*ఈ కార్యక్రమంలో..* ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు గారు,హెలికాప్టర్ ఎయియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి, టి ఎస్ టి డి సి MD మనోహర్ గారు, GM అంజిరెడ్డి మరియు టూరిజం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.