బుద్ధవనం వెబ్ సైట్ ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.

హైదరాబాద్, ఫిబ్రవరి 15 నిజం న్యూస్

రవీంద్రభారతిలోని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఛాంబర్ లో “బుద్ధవనం ప్రాజెక్టు”వెబ్ సైట్ ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిసి పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త .

తెలంగాణలోని నాగార్జున సాగర్ వద్ద నాగార్జున కొండపై నిర్మిస్తున్న బుద్ధవనం ప్రాజెక్టు వెబ్ సైట్ ప్రారంభించడానికి ఈరోజు హైదరాబాద్,
రవీంద్రభారతిలోని పర్యాటకశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ చాంబర్ లో సమావేశం నిర్వహించారు. తదుపరి వారి చేతుల మీదుగా బుద్ధవనం వెబ్ సైట్ ను ప్రారంబించడం జరిగింది. తదనంతరం కార్యక్రమన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.

తెలంగాణలోని నాగార్జున సాగర్ వద్ద నాగార్జున కొండపై నిర్మిస్తున్న నాగార్జున సాగర్ బౌద్ద వారసత్వ థీమ్ పార్క్ (బుద్ధవనం) ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు అని. ఈ పార్కును 275 ఎకరాల్లో నిర్మిస్తున్నట్లు తెలిపారు . ఈ బుద్ధవనంలో మఠాలు , ఎకో టూరిజం రిసార్టులు , ఫుడ్ పార్కులతో పాటు ఇతర సౌకర్యాలను కల్పించనున్నారు. బౌద్ధంలోని మహాయానం పుట్టిన గడ్డ నాగార్జునసాగర్ ను ప్రపంచపటంలో నిలిపేలా రూ.100 కోట్ల వ్యయంతో బుద్ధవనం ప్రాజెక్టును నిర్మించామని అన్నారు.