ఎండు గంజాయి విక్రయిస్తున్న మహిళ అరెస్ట్

నిజామాబాద్ ఫిబ్రవరి15 (నిజం న్యూస్)డిచ్పల్లి మండల కేంద్రంలో ఎండు గంజాయిని యువతకు విక్రయిస్తున్న ఓ మహిళను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్ చంద్ర తెలిపారు విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం రాత్రి ఎక్సైజ్ శాఖ సిబ్బంది నిర్వహించిన ఈ దాడుల్లో 400 గ్రాములు రెండు ప్యాకెట్లు పట్టుకున్న అని తెలిపారు ఈ కేసుకు సంబంధించి మహిళను అరెస్టు చేసినట్లు ఆయన వివరించారు దీని వెనుక ఎవరున్నారు దర్యాప్తు చేస్తున్నట్లు గంజాయి అక్రమ రవాణా చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని నవీన్ చంద్ర తెలిపారు