సహస్రాబ్ది..నిజంగానే నభూతో !

హైదరాబాద్‌కు మకుటాయమానంగా ముచ్చింతల్
సహస్రాబ్ది మహోత్సవం అప్పుడే ముగిసిందంటే ఎందుకనో నమ్మబుద్ది కావడం లేదు. ముచ్చింతల్‌లో ఏర్పాటయిన రామానుజుల అతి పెద్ద విగ్రమం,108 ఆలయాల సమాహారం హైదరాబాద్‌కు తలమానికం కాబోతున్నాయి.
ఈ ఉత్సవాలు ముగిసినట్లుగా భావిస్తున్న తరుణంలో యాదాద్రి కూడా వచ్చే నెలలో పునఃప్రారంభానికి సిద్దంగా ఉంది. ఈ రెండూ తెలంగాణకు మకుటాయమానంగా నిలవనున్నాయి. ఇ
ది జాతి గర్వంగా చాటుకునే మరో మహోజ్వల ఘట్టానికి స్ఫూర్తి రగిలిస్తుందేమో..!అందుకే ఇది ముగిసినట్టుకాదు… ఇదే నా మాట కాదు.. మన స్వామి వారి శ్రీవాక్కే..! అందుకే ’నభూతో’ అనొచ్చేమో కాని ’న భవిష్యతి’ అనొద్దన్నారు.
అంటే భావి సంకేతం ఏదైనా సూచిస్తున్నారా?… ఏమో మరి! ఈ సహస్రాబ్ది గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అపూర్వమనా, అద్వితీయమనా, పరమాద్భుతమనా, మహోజ్వలమనా… ఏ పదమూ చాలట్లేదు ఆ అనుభూతిని ఒంపడానికి…! ఈ ఆనందమొక అమృతప్రాయం. ఎంత చూసినా, ఎన్ని రోజులు జరిగినా ఇక చాలన్న తృప్తే కలగదు… 12రోజులు ఇట్టే గడిచాయి.
కరోనా కోరలు చాస్తున్న ఈ సమయంలో అతిపెద్ద కార్యక్రమం తలపెట్టడంపైనా అనుమానాలు వచ్చాయి. కాని స్వామివారు అచంచలంగా వున్నారు. స్థిర సంకల్పులై కదిలారు. సంకల్పం దైవికమూ, సత్యమూ అయనది కనుక జగదానందకారకంగా సంపన్నమై తీరుతుందని దృఢంగా వున్నారు.. అదే నిజమైంది. వారి సత్యసంకల్పం సాకారమైంది. చరిత్ర ఎరగని వైభవోజ్వల ఘట్టమిది…
పూర్ణహుతితోనే కరోనా పవిత్ర హోమాగ్నిలో కాలి మసైపోయింది.. కోట్లాది అనుష్ఠిత అష్టాక్షరి బీజాక్షరాల ధాటికి రూపే లేకుండా పోయింది… ఇకపై ఏ మహమ్మారి పీడా దాపురించకుండా హోమధూమం విశ్వానికి ఓ దుర్భేద్యమైన రక్షాకవచంగా మారబోతోందా అన్ననమ్మకం కలిగించేలా కరోనా కేసులు కూడా భారీగగా తగ్గుముఖం పట్టాయి. ఇది అతిశయోక్తికాదు.. కరోనా లెక్కలోసారి చూడండి..
సహస్రాబ్ది మొదలైన నాటికీ, ఈ రోజుకీ ఎంత తేడా… కరోనా ఊసెక్కడా లేదు. అంతెందుకు? ఈ మహాక్రతువులో ఐదారువేలమంది రుత్విజులు ఒక్కచోట రెండు వారాలు కలిసున్నారే.! అక్కడ కైంకర్యంలో పాల్గన్నవాళ్లని కలిపితే పదివేలపైనే వుంటారేమో..! మరి ఎంత భయముండాలి?
ఇంత సమూహంలో మహమ్మారి ప్రతాపం ఎంత తీవ్రంగా వుండాలి? మాస్కుల్లేవు… దూరాల్లేవు… అయినా ఒక్కరైనా బాధపడ్డ దాఖలా లేదే..! ఇది చాలదా ఈ మహాక్రతువు మహమ్మారికి ఎంత అద్భుతమైన విరుగుడుగా మారిందో చెప్పడానికి..!
జగదోద్దారకుడైన ఆచార్యుడు ప్రభవించాడని… మరి ఆ జగదాచార్యుల దివ్యత్వమే కదా ఇప్పుడు మనల్ని ఈ మహమ్మారి నుండి రక్షించింది..! కరోనా గురించి ఇకపై మాట్లడాల్సివస్తే సహస్రాబ్దికి ముందూ సహస్రాబ్ది తర్వాత అని చెప్పుకుంటామని..! ఇప్పుడు సరిగ్గా అదే జరగబోతోంది.
1035 కుండాలు, ఐదువేలకు ఫైగా రుత్విజులు, చతుర్వేదాల మంత్రఘోషలు, పదికోట్ల అష్టాక్షరి మహా మంత్ర అనుసంధానం, లక్షల గొంతుకల్లో ధ్వనించిన విష్ణు సహస్రనామాలు…అన్నింటికీ మించి విశ్వరక్షకుడై అంతెత్తు కొలువు తీరిన ఆచార్యుల విశ్వరూపం, వారే రప్పించుకున్న 108 దివ్యాలయాల పెరుమాళ్ల పరివారం..ఎంత పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తూ వూండాలి ఈ పావనస్థలి నుంచి..! ఇందరు దేవుళ్లు కొలువైన ఈ ఆధ్యాత్మిక ధామాన్ని తలుచుకుంటేనే ఒళ్లు పులకరిస్తుంది… మనసు పరవశిస్తుంది… చీలికలతో పేలికలైన సమాజంలో సమతాస్ఫూర్తితో ఓ అద్వితీయమైన పరివర్తనకు అంకురం పడిరది.. అదింతై, ఇంతకు మరింతై విశ్వాన్నంతా కుటుంబీకరించే దిశగా సాగితీరుతుంది..మనమంతా ఒక్కటే అన్ననినాదాం ఇప్పుడు విశ్వవ్యాప్తం కావాలని కోరుకుందాం.