కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే మా లక్ష్యం

టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
హైదరాబాద్ ,ఫిబ్రవరి 15 నిజం న్యూస్.
జూబ్లీహిల్స్ లో భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో మంగళవారం రోజున వారిని మర్యాదపూర్వకంగా కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణపై చర్చించి ,తర్వాత ప్రెస్ మీట్ లో పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి మరియు టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్.
.ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ*…….
రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడమే మా ధేయంగా పని చేస్తాం.
పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి ,రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడమే మా లక్ష్యం.
కాంగ్రెస్ సీనియర్ నాయకులతో చర్చించి ప్రతి కార్యక్రమాని ముందుకు తీసుకుని వెళ్తాము అని వారు పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.