ఆర్టీసీలో ప్రయాణం..సురక్షితం…ఎంఎల్ఏ సీతక్క

ఆర్టీసీ లో ప్రయాణం ,సురక్షితమైన ప్రయాణం !

ములుగు శాసనసభ్యులు .సీతక్క.

ములుగు ,ఫిబ్రవరి 15 నిజం న్యూస్

మేడారం సమ్మక్క సారక్క జాతరను పురస్కరించుకొని మంగళవారం రోజున ములుగు శాసనసభ్యులు, ఐరన్ లేడీ , సీతక్క,ములుగు నుండి మేడారం వరకు
ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతుందని ఈ అవకాశాన్ని ప్రతి భక్తులు ప్రయాణికులు సద్వినియోగం చేసుకొని, ఆర్టీసీని లాభాల బాటలో నడుపుటకు ప్రయత్నం చేయాలని కోరారు. మందు సేవిస్తూ జాతరలో వాహనాలను నడప వద్దని, మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ, మొక్కులు చెల్లించాలని కోరారు.