భర్త కోసం అడవి బాట పట్టిన భార్య సోనాలి

మావోయిస్టుల చెరలో ఇంజనీర్ అశోక్ పవర్… భర్త కోసం అడవి బాట పట్టిన భార్య సోనాలి
చర్ల ఫిబ్రవరి 15 (నిజం న్యూస్) సతీష్ గడ్ బీజాపూర్ జిల్లా బెద్రే పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రావతి నది పై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను పర్యవేక్షిస్తున్న ఇంజనీర్ అశోక్ పవర్ అతని సహాయకుడు ని మావోయిస్టులు నాలుగు రోజుల క్రితం కిడ్నాప్ చేశారు దీంతో ఇరు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు భర్త తిరిగి రాకపోవడంతో అశోక్ పవర్ భార్య సోనాలి తన భర్తకు ఏమి హాని తలపెట్టకుండా క్షేమంగా విడిచిపెట్టాలని మావోయిస్టులను వేడుకుంటుంది ఇద్దరు పిల్లలతో తన భర్త అశోక్ పవర్ కోసం అడవి బాట పట్టింది గత ఏడాది నవంబర్ నెలలో బ్రిడ్జి పనులను పర్యవేక్షిస్తున్న ఇంజనీర్ అజయ్. ను కిడ్నాప్ చేసి న మావోయిస్టులు ఏడు రోజుల అనంతరం వివిధ సంఘాల పెద్దల ద్వారా మీడియా సమక్షంలో ప్రజా కోర్టు ద్వారా విడుదల చేశారని తెలుస్తోంది ప్రస్తుతం మావోయిస్టుల వద్ద ఉన్న తన భర్తను సురక్షితంగా విడిచిపెట్టడానకి పెద్దలు సహకరించాలని అశోక్ భార్య సోనాలి చేతులు జోడించి వేడుకుంటోంది