ఉదారత చాటిన సర్పంచ్ నల్లు రాంచంద్రారెడ్డి

గిరిజన బాలికల పాఠశాలలకు ఉదారత చాటిన సర్పంచ్ నల్లు రాంచంద్రారెడ్డి !
ఎన్నారై ,సర్పంచుల ఫోరం అధ్యక్షులు నల్లు రామచంద్ర రెడ్డి కి మండల ప్రజలు, మేధావులు .యువత , పాఠశాల విద్యార్థులు కృతజ్ఞతలు .
తుంగతుర్తి ఫిబ్రవరి 15 నిజం న్యూస్
తుంగతుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థుల అవసరాల నిమిత్తం 50 వేల రూపాయల విలువ గల వాటర్ ట్యాంక్ నిర్మించడానికి ముందుకు వచ్చి, పేద విద్యార్థుల పట్ల తన ఉదారతను చాటుకున్న గానుగుబండ గ్రామ సర్పంచ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు, ఎన్నారై, నల్లు రాంచంద్రారెడ్డి నేనున్నానని ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించడం హర్షించదగ్గ విషయం. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ దుర్గ భవాని, తెలంగాణ గురుకుల తల్లిదండ్రుల కమిటీ సూర్యాపేట జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండగడుపుల ఎల్లయ్య, ఉపాధ్యాయులు బింగి వెంకటేశ్వర్లు, జీవిత, స్వప్న, వేణుగోపాల్ తో పాటు గ్రామస్తులు గుండ గాని దుర్గయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.