రెగ్యులర్ ఏపీ పి. శ్రీలత ను సన్మానించిన తుంగతుర్తి బార్ అసోసియేషన్

రెగ్యులర్ ఏపీ పి. శ్రీలత ను సన్మానించిన తుంగతుర్తి బార్ అసోసియేషన్!
తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు, అనపర్తి జ్ఞాన సుందర్.
తుంగతుర్తి ,ఫిబ్రవరి 15 నిజం న్యూస్
తుంగతుర్తి జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఏర్పడి సుమారుగా 11సంవత్సరాలు అయినది. రెగ్యులర్ జడ్జి లేక రెగ్యులర్ ఎపిపి లేక నానా అవస్థలు పడ్డాం. తుంగతుర్తి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రెగ్యులర్ ఆఫీసర్ కొరకు ఎపిపి కొరకు చాల శ్రమ తీసుకున్నాం. హైకోర్టు వారు గొప్ప న్యాయమూర్తి నినియమించచారు. కోర్టులో ఉండబడిన పెండింగ్ కేసుల పరిష్కారానికి జడ్జి గారు పనిచేస్తున్న విధానం మాటల్లో రాయలేను. జడ్జి గారి పనివిధానం వలన త్వరగతిన కేసుల పరిస్కారం మరియు న్యాయ వాదులు పని మెరుగైన పని విధానం నేర్చుకుంటున్నాం. అదే విధంగా నూతనంగా లెగ్యులర్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా హైదరాబాద్ నివాసి గౌరవ శ్రీలత సోమవారం నియమించబడినారు. రెగ్యులర్ ఎపిపి గారి నియామకం వలన క్రిమినల్ కేసుల పరిష్కారం త్వరగా పరిష్కారం అవుతాయి. వారికి బార్ అసోసియేషన్ తరుపున హృదయం పూర్వక స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు