గంటల తరబడి కూర్చున్నా బస్సులు రాకపోయే

సూర్యాపేట బస్టాండ్ లో ప్రయాణికుల కటకట!

గంటల తరబడి కూర్చున్నా బస్సులు రాకపోయే, సజ్జనార్ సార్…. ప్రయాణికులు ఆవేదన.

సూర్యాపేట, ఫిబ్రవరి 15 నిజం న్యూస్.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో సోమవారం రోజున తుంగతుర్తి ,తిరుమలగిరి, జనగాం నల్లగొండ స్టాండు లా వద్ద గుంపులు గుంపులుగా ప్రయాణికులు చేరుకొని, బస్సుల రాక కోసం ఎదురు చూపులతో నిలబడిన సన్నివేశం చోటు చేసుకుంది. ఒక ప్రక్క ఆర్టీసీ ప్రయాణికులకు మేలైన సౌకర్యం కోసం, 30 మంది పిలిస్తే బస్సు వస్తుందని చెబుతున్న టి ఎస్ ఆర్ టి సి డి ఎం. సజ్జనార్ సార్… ప్రయాణికుల గ గోళ్లు కనబడలేదని, బస్టాండ్ లో ప్రయాణికుల ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు వెళ్లి తిరిగి రావడానికి కనీసం సుమారు గంట లేట్ కావటంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. దీనికితోడు ములుగులో సమ్మక్క సారక్క జాతర జరుగుతున్నందున డిపోకు చెందిన కొన్ని బస్సులు వెళ్లాయని అధికారులు వాపోయారు. దీనికితోడు మంచినీటి సౌకర్యం కూడా పూర్తి స్థాయిలో లేకపోవడం దారుణమని అధికారులను, ప్రయాణికులు దూషించారు. ఏది ఏమైనా ఈ సంఘటనతో గ్రామీణ ప్రాంత ప్రజలు మహిళలు ,వృద్ధులు , చంటి పిల్లల తల్లులు, తీవ్ర ఇబ్బందులకు గురి కావడం గమనార్హం.