Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్

జనగాం కొడకండ్ల ( నిజం న్యూస్)

బంజార జాతి సేవాలాల్ మహారాజ్ ను భగవత్‌ స్వరూపుడిగా,అవతార పురుషుడిగా సామాజిక క్రాంతి వీరుడిగా ఆరాధ్య దైవంగా కారణ జన్ముడిగా భావిస్తారు.సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ జయంతిని గోర్‌ బంజారాలు పండుగ దినంగా వేడుక గా యావత్ ప్రపంచంలోని బంజరా ప్రజలందరూ అన్ని తండాల్లో గ్రామాలలో ఫిబ్రవరి 15 రోజున సేవాలాల్ జన్మదిన రోజుగా జరుపుకుంటారు
క్రీస్తుశకం 1191 సంవత్సరంలో ఉత్తర భారతంలో గోర్‌ బంజారాలపై ముస్లీం రాజు మహమ్మద్ ఘోరీ కి వ్యతిరేకంగా పోరాడిన పృథ్వీరాజ్ చౌహాన్ పక్షాన పోరాడిన వీరోచిత చరిత్ర బంజారాల సొంతం.బంజారాలు తమ ఉనికి కాపాడుకోవడానికి శత్రువుల కంట పడకుండా దక్షిణాది బాటపట్టారు.

రాజస్థాన్‌లోని మాలువ ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర ఇలా దక్షిణ భారతదేశం వరకు గోర్‌ బంజారాలు పశువులను మేపుకుంటు వలసలు వెళ్లారు. ఆ కమ్రంలోనే రమావత్‌ రాంజీనాయక్‌ వారితో పాటు 360 కుటుంబాలు 3775 గోవులతో కర్ణాటక రాష్ట్రంలోని గుత్తి గ్రామానికి చేరుకున్నారు. (అనంతపురం అప్పట్లో కర్ణాటక పరిధిలోనే ఉంది). అక్కడ గొల్లయ్య దొడ్డిలో నివాసం ఏర్పరుచుకున్నారు.

రాంజీనాయక్‌కు ముగ్గురు కుమారులు కాగా పెద్ద కుమారుడు భీమానాయక్‌ కు కర్ణాటకలోని ధర్మిణి బాయితో వివాహం జరిగింది. పెళ్ళైన తర్వాత ఈ దంపతులకు సంతానం కాకపోవడం తో రమావత్‌ భీమానాయక్‌, ధర్మిణిబాయి తన కులదేవతలైన అమ్మవార్లకు పూజలు చేసి సంతానం కల్గుజేయలని తుళజ, మంత్రాల, సీత్లా, హీంగాలి, డోలంగార్‌, దండి, మేరామా భవానిలకు ప్రత్యేక పూజలు చేసి సంతానం ఇవ్వమని కోరుకున్నారు.

ఆక్రమంలోనే ఏడుగురు దేవతల్లో మేరామాయాడి అంశతో 1739 ఫిబ్రవరి 15న ఆ దంపతులకు బంజారాలు దివ్యతేజంగా కొలిచే రమావత్‌ సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ జన్మించారు. గోర్‌బంజారాలను సంస్కరించడానికి ఆ రోజుల్లో ఉండే వారి దురలవాట్లను దూరం చేయడానికి సంఘ సంస్కర్తగా సేవాలాల్‌ జన్మించారని అదృశ్యవాణి వినిపించిందని గుత్తిలో నివసిస్తున్న సదరు గోర్‌బంజార పూర్వ లంబాడి గిరిజన పెద్దల ప్రగాఢ నమ్మకం.

సేవాలాల్ మహారాజ్ జన్మించిన తర్వాత ఆ గ్రామంలో ప్రజలందరి కి చిన్న పాటి వ్యాధులు రావడం తో ఆ గ్రామ ప్రజలు వాళ్ళ కులా దైవలైన మెరమ్మ యాడికి పూజలు చేసి ఈ మహమ్మారిని పారదొలలని వేడుకుంటారు అప్పుడు అమ్మ వారు ప్రత్యక్షం అయి సేవాలాల్ మహరాజ్ ను తనకు ఇవ్వాలని గ్రామ పెద్ద కి చెప్పిందని చెప్తారు.

ఐతే సేవాలాల్ మహరాజ్ దీనికి ఒప్పుకోరు ఒప్పుకోక పోవడం తో మరల వాళ్ల పెద్దలు ఆ ఏడుగురు అమ్మ వార్లకు పండగ చేయడానికి సిద్ధం ఐతరు ఏడుగురు అమ్మవార్లకు ఏడు మేకపోతులను బలి ఇస్తే మహమ్మారి గ్రామాన్ని వదిలి వెళ్ళిపోతుంది అని భావిస్తారు అయితే సేవాలాల్ మహరాజ్ మూగ జీవాలను బలి ఇయ్యడనికి ఒప్పుకోడు మూగ జీవాల కు బదులుగా సేవాలాల్ మహరాజ్ తన తలను నరుక్కుంటడు అయితే జగదాంబ యాడి( మేరమ్మ యాడి) ప్రత్యక్షం అయి సేవాలాల్ మహరాజ్ తలను తన మహిమతో అతుక్కోపెడ్తది అది తెల్సుకున్న సేవాలాల్ మహరాజ్ మేరమ్మా యాడికు భక్తుడిగా మారిపోతాడు.

అప్పటి నుండి సేవాలాల్ మహరాజ్ జాతి అభ్యున్నతికి సంఘ సంస్కర్తగా పని చేస్తూ పోతాడు మేరామ్మ యాడీ అనుగ్రహం తో ఇతను తన జాతి వారికి అన్నీ విధాలుగా బాసటగా ఉన్నాడు సేవాలాల్ మహరాజ్ కి గోప శక్తి ఉండేది తన భక్తి మార్గాలతో లింగ మార్పిడి సైతం చేసే అంత శక్తి ముక్తులు ఉండేవని బంజారాలు చెప్తారు సేవాలాల్ మహరాజ్ కొన్ని ఉద్యమాలు కూడా చేశాడు ధర్మ ప్రచారం, మత మార్పిడి ఆరికట్టుట మరియు ఆర్ధిక సంస్కరణ ఉద్యమాలు కూడా చేశాడు అని బంజారా చరిత్ర కారులు చెప్తున్నారు/

సేవాలాల్ మహరాజ్ గోవులు మేపేవాడిని అడివిలో నే బంకమట్టి తో రొట్టెలు చేసుకొనేవాడని వాటినే తినేవాడు అని తను గోవులు మేపడనికి వెళ్ళినపుడు తిస్కెల్లే సద్ది కుడును వేరే వాళ్లకు ఇచ్చే వాడని చరిత్ర సేవాలాల్ మహరాజ్ జగదాంబ ( మెరమ్మా యాదడి) నే తన గురువుగా మార్గ దర్శకురాలిగా పూజించేవాడు. బంజారాలు రాజ పుత్రులాంటి వారని చరిత్ర కారుడు కల్నల్ టాడ్ పేర్కొన్నరంటే బంజారాలు ఎంతటి దృడవంతులు అన్నది మనం అర్థం చేసుకోవచ్చు బంజారాలు రాజుల కాలం నాటి నుండి బ్రిటిష్ వాళ్ళ వరకు వివిధ రాజ్యాలకు అవసరమైన యుద్ద సామగ్రిని అందించేవరని చెప్తారు.

సేవాలాల్ మహరాజ్ జాతిని సన్మార్గం లో నడపిన గొప్ప నాయకుడిని అంటారు కాకతీయుల కంటే ముందే బంజారాలు దక్కన్ పీఠభూమి లో ఉన్నారని చరిత్ర తెలుపుతున్నది.సంచార జాతివారైన వీరు రజాకార్లతో పోరాడారు వీరి ధైర్య సాహసాలను మెచ్చి వీరికి భూములను ఇనాములుగా ఇచ్చారని చరిత్ర తెలుపుతున్నది.బంజారాలు ఎవరికి కూడా హని తలపెట్టే వారు కాదని సహాయ గుణం విరివిగా కలవారని ధైర్య సాహసాలకు ప్రతికలని చరిత్ర కారులు చెప్తున్నారు పతి సంవత్సరం బంజారాలు తీజ్ పండుగను జరుపుకుంటారు.

ఆ సమయంలో బంజారా ఆడబిడ్డలు సేవాలాల్ మహరాజ్, మేరామ్మా యాడి, దండి యాడిలకు పూజలు చేస్తారు పూజలు చేసి పాడి పంటలు సకల సంపదలు కలగాలని వారికి మంచి భర్తలు రావాలని ప్రార్థిస్తారు.దేశంలో 11 కోట్ల జనాభా కల్గిన బంజారాల ఆరాధ్య దైవం సెవాలాల్ మహరాజ్ అని బంజారా బిడ్డల నమ్మకం. మహరాజ్ జన్మదినాన్ని సెలవు దినంగా ప్రకటించి ప్రభుత్వాలు సహకరించాలని బంజారాలు చెప్తున్నారు.

బంజారాలు తర తరలుగా వివక్షత కు గురవుతున్నారని ఆర్థిక సామాజిక ఆర్థిక రాజకీయలలో వెనుకబడి ఉన్నారని బంజరాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బాధ్యతగా భావించాలి బంజరాలే సుగాలిలుగా గ్వార్ భాయ్ మరియు గిరిజనులు గా ప్రపంచ వ్యాప్తంగా పిలవబడుతున్నరు.2000 వ సంవత్సరం నుండి అనంతపురం జిల్లా గుత్తిలో గుడి నిర్మించి పూజలు నిర్వహిస్తున్నారు