ఎర్ర గుట్ట వద్ద మాటువేసిన పులి.. పశువుల దొడ్డి పై దాడి

ఎర్ర గుట్ట వద్ద మాటువేసిన పులి.. పశువుల దొడ్డి పై దాడి
చర్ల ఫిబ్రవరి 14 ( నిజం న్యూస్) గత మూడు రోజుల క్రితం సుబ్బంపేట అటవీ ప్రాంతంలో పులి సంచారం అన్న సమాచారం మేరకు సుబ్బంపేట గొల్లగూడెం క్రాంతి పురం బి ఎస్ రామయ్య నగర్ పరిసరప్రాంతాలలో పులి సంచారం ఉందన్న సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అటవీ ప్రాంతం నుండి గోదావరి తీరారం దాటి మణుగూరు మండలం రామాంజపురం అటవీ ప్రాంతంలో ఎర్ర గుట్ట సమీపంలో మాటు వేసిన పెద్ద పులి కొండాయి గూడెం వేణుగోపాల స్వామి ఆలయం వెనుక పశువుల దొడ్డ పై దాడి చేసి ఒక అవును చంపివేసింది. మూడు రోజుల తర్వాత పులి జాడ గుర్తించారుదీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పులి సంచారంతో భయాందోళన చెందుతున్నారు .