సాంబార్ గిన్నెలో పడి రెండేళ్ల పాప మృతి

కృష్ణాజిల్లా: విస్సన్నపేట.
కలగరలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆదివారం కారుమంచి శివ, బన్ను దంపతుల రెండు సంవత్సరాల తేజస్వినికి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉండగా భోజనాలు జరిగే ప్రాంతంలో కుర్చీలో ఆడుకుంటూ తేజస్విని జారీ సాంబార్ గిన్నెలో పడిపోవడంతో కుటుంబ సభ్యులు తిరువూరు పట్టణంలోని ప్రైవేట్ వైద్యశాలలో వైద్యం చేయించి డాక్టర్ల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం విజయవాడ లోని వైద్యశాలకు తీసుకువెళ్లారు..
తెల్లవారుజామున విజయవాడ తీసుకెళ్లి వైద్య చేస్తుండగా సోమవారం ఉదయం తేజస్విని చనిపోవడం జరిగింది.
పసిపాప మృతి తో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి..