మల్లికార్జున స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన మంత్రి

మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి
తిరుమలగిరి ఫిబ్రవరి 14 నిజం న్యూస్
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంత కండ్ల జగదీశ్వర్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆర్ సోమవారం నాడు తిరుమలగిరి మండలం జలాల్ పురం గ్రామంలో ని శ్రీ అష్ట లింగేశ్వర మల్లికార్జున స్వామి దేవాలయంలో గరుడ స్తంభం ప్రతిష్టాపన లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేవాలయంలోని ప్రాంగణాన్ని పరిశీలించి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు .
ఈ ఆలయంలో ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో ఉండడంతో పాటు అద్భుతమైన శిల్ప సంపద ఉందని దీని అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి అన్నారు.
శివనామస్మరణతో మారుమోగిన అష్ట లింగేశ్వర స్వామి ఆలయం స్వామిని దర్శించుకునేందుకు మండల కేంద్రంలోని అనేక గ్రామాల నుండి భక్తులు తండోపతండాలుగా వచ్చి భక్తీ శ్రద్దలతో పూజలు నిర్వహించి కోరిన కోరికలు తీరాలని భక్తులు వేడుకొన్నారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ బెట్టం నాగేశ్వరరావు,
తిరుమలగిరి టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు రఘునందన్ రెడ్డి,
మండల ఎంపిపి స్నేహలత, జడ్పిటిసి అంజలి రవీందర్ టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి తెడ్డు భాస్కర్, బీసీ సెల్ అధ్యక్షుడు దాచేపల్లి వెంకన్న, ఎంపీటీసీ ధరావత్ రంగమ్మ రవి, స్థానిక ఉపసర్పంచ్ ఆకుల మహేశ్వరి నాగయ్య, మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు