రసాయన ఆహారం
రసాయన ఆహారం
ప్రస్తుతం రసాయనాలు జీవకోటికి పెనుముప్పుగా తయారయ్యాయి. పంట చేలను కాపాడుకునేందుకు, నీళ్లు కలుషితాన్ని నివారించేందుకు, చెడు బ్యాక్టీరియా నుంచి బయటపడేందుకు ప్రయోగశాలల్లో రూపొందించిన రసాయనాలు మానవాళి జీవస్మరణ సమస్యకు దారితీస్తున్నాయి.
మోతాదుకు మించి రసాయనాల వినియోగం, పంటచేలపై హానికరమైన క్రిమిసంహారకాలు వెదజల్లుతూ మానవుడు తన ప్రాణానికి తానే ముప్పుగా పరిగణిస్తున్నాడు. తాజాగా ఏలూరులో జరిగిన ఘటన ఉదాహరణ. ప్రాణనష్టం పెద్దగా లేనప్పటికీ ఘటన మాత్రం చాలా ఆందోళనకరంగా ఉంది. నీళ్లు పాలు కూరగాయల ద్వారా మోతాదుకు మించి క్లోరిన్, సీసం, భార లోహాలు శరీరంలోకి ప్రవేశించడం వల్ల ఒక్కసారిగా శరీరంలో మార్పులు సంభవిస్తున్నాయి.
ప్రస్తుతం రోగులు ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నప్పటికీ వారి శరీరంలో కొన్ని దుష్ప్రభావాలు చోటు చేసుకునే ఉంటాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా ముార్చ, ఫిట్స్ వంటి వ్యాధులు ఒక్కసారి సంక్రమిస్తే చాలా సంవత్సరాల పాటు, కొన్ని సందర్భాల్లో జీవితాంతం ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం అన్వేషించినప్పుడు మోతాదుకు మించి రసాయనాలు వాడినట్లు తేలింది. పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం తాత్కాలిక ఉపశమనం కలిగిన కలిగినప్పటికీ మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాపోదన్న అంశంపై స్పష్టత లేదు. పంటచేలలో క్రిములు రాకుండా ఉండేందుకు వాడుతున్న రసాయనాలు శరీరానికి ఎంతో హాని చేస్తున్నాయి.
ముఖ్యంగా ఆకుకూరలు మరింత ప్రమాదకారిగా ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆకుకూరలు తినాలని వైద్యులు చెబుతుంటారు. అయితే ఆకుకూరలపై రసాయనాలు వెదజల్లడంతో అవి మూలాల్లోకి వెళ్లి నిల్వ ఉండిపోతున్నాయి. సాధారణ నీళ్ళలో వీటిని కడిగినా అవశేషాలు మాత్రం మిగిలి పోతున్నాయి. ఇవి కడుపులోకి వెళ్ళినప్పుడు ప్రతికూల ప్రభావం చూపుతుంది. శరీరంలో సున్నితమైన అనేక భాగాలు దెబ్బతింటున్నాయి.దీనితో రోగాల బారిన పడుతున్నారు.
సేంద్రీయ సేద్య విధానం అందుబాటులోకి రావాలని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ శక్తివంతమైన క్రిమిసంహారకాలకు అలవాటు పడిన రైతులు సహజ క్రిమిసంహారకాల పై ఆసక్తి చూపించడం లేదు.వేప,వర్మి, కంపోస్ట్ గోమూత్రం వంటి వాటితో మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం సింథటిక్, విషతుల్యమైన క్రిమిసంహారకాలు మాత్రమే వినియోగిస్తున్నారు. నీళ్లను శుద్ధి చేయడానికి క్లోరిన్ వాడుతుంటారు. పురపాలక సంఘాలు, కార్పొరేషన్లలో ప్రజలకు అందించే నీటిలో క్లోరిన్ ఎక్కువ మోతాదులోనే ఉంటుంది. క్రీములు చనిపోవడానికి క్లోరినేషన్ తప్పనిసరి. ఇళ్లలో నీటిని శుద్ధి చేసే అధునాతన పరికరాల్లో కూడా క్లోరిన్ ఉంటుంది. అయితే ఇది తక్కువ మోతాదులో ఉండాలి కేవలం ఆయన మాత్రమే చెప్పే విధంగా ఉండాలి. కేవలం క్రిములను మాత్రమే చంపే విధంగా ఉండాలి. అయితే పరిమితికి మించి వాడటం వల్ల ప్రాణాలకు హాని కలుగుతుంది.
ఏదైనా సరే పరిమితికి మించి వినియోగించినప్పుడు ఇలాంటి ఇబ్బందులు తప్పడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ప్రాంతంలో ఎక్కువగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులు ఉండే హాస్టళ్లలో ఇలాంటి సమస్యలు తలెత్తుతుా ఉంటాయి.ముఖ్యంగా విద్యార్థులు ఉండే హస్టళ్ల లో ఇలాంటి సమస్యలు తలెత్తుతుా ఉంటాయి. పోలీస్ శిక్షణ కేంద్రంలో కూడా కలుషిత నీరు తాగడం వల్ల పెద్ద సంఖ్యలో శిక్షణార్థులు ఆస్పత్రి పాలయ్యారు. ఇక సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో దోహదం చేసే పండ్లు కుడా రసాయానాల ముప్పును తీసుకు వస్తున్నాయి. పచ్చిగా ఉన్న పండ్లను పండించేందుకు రసాయనాలు ఉపయోగిస్తారు. కార్బన్ ను చిన్న పొట్ల లో పెట్టి మామిడి పండ్ల బుట్ట లో పెడితే కేవలం 12 గంటల్లోనే మామిడి పళ్లు మగ్గినట్లుగా కనిపిస్తాయి. అయితే వీటిని సేవిస్తే ఆరోగ్యం సంగతి పక్కన పెడితే ఆసుపత్రికి వెళ్లే దుస్థితి ఎదురౌతోంది.
అరటి పళ్లపై రసాయనాలు స్ర్పే చేస్తారు . పచ్చిగా ఉండగానే పసుపు పచ్చగా మారతాయి.ఇక ద్రాక్ష విషయంలో కూడా క్రిమిసంహారకాల ప్రభావం అధికంగా ఉంటుంది. ద్రాక్ష పళ్లకు ఉండే తొడిమ ద్వారా క్రిమిసంహారక రసాయనాలు లోనికి చేరుకుంటుంది. పైన నీటితో కడిగి శుభ్రం చేసుకున్నా ద్రాక్ష లోపల ఉన్న అవశేషాలు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. హైదరాబాదులో మూసినది జలాలు అపరిశుభ్రంగా ఉంటాయి. ఈ ప్రాంతంలో పండించిన కూరగాయలు, ఆకుకూరలు ఎట్టి పరిస్థితులలో భుజించకుాడదు. అదేవిధంగా జిల్లాలో పరిశ్రమలు వదిలే రసాయనాలతో కూడిన నీరు కొన్ని జలాశయాలకు చేరుతుంది. ఇక్కడ పంటలు వేయకుాడదు. అయితే అధికారులు శ్రద్ధ చూపకపోవడంతో ఈ ప్రాంతంల్లో పండించే ఉత్పత్తులు మార్కెట్ కు చేరుకుంటున్నాయి.
ఇక పాల విషయంలో కూడా ఏమాత్రం మినహాయింపు ఉండడం లేదు. పాలలో రసాయనాలు చేరుతున్నాయి. ఆవులు , బర్రెలు పాలు అధికంగా ఇవ్వడానికి వాటికి ఇంజెక్షన్ రూపంలో రసాయనాలు పంపిస్తారు. వీటి ప్రభావం కనిపిస్తాయి. ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఈ పాలు సేవిస్తే వారికి ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయి. పిల్లలు పుట్టుకపోవడం, నెలసరి సరిగ్గా లేకపోవడంతో పాటు రోమ్ము క్యాన్సర్ వంటి తీవ్ర రోగాలకు కారకంగా మారుతుంటాయి. కోడి, మేక మాంసం కూడా రసాయనపుారితంగా ఉంటున్నాయి. కోడి సైజు పెద్దది గా ఉండటానికి ని డ్రెస్సింగ్ తర్వాత ఇంజక్షన్ ఇస్తారు. ఈ రసాయనం శరీరంలో కి వెళితే నాడీవ్యవస్థ దెబ్బతింటుంది. వీటిపై అధికారులు ఎప్పటికప్పుడు శ్రబ్ద చుాపించి చర్యలు తీసుకోవాలి. అయితే కావలసిన మేరకు సిబ్బంది లేకపోవడం, ఉన్న కొందరు అవినీతికి అలవాటు పడడంతో వీటిని కట్టడి చేసే వారు లేకుండాపోయారు.
ప్రభుత్వాలు చిత్తశుద్ధితో రసాయనాల వాడకాన్ని అడ్డుకోవడం ద్వారా మాత్రమే నాణ్యమైన ఉత్పత్తులు అందేలా చేయగలరు. ప్రజల్లో కూడా చైతన్యం వస్తే గాని పరిస్థితుల్లో మార్పులు రావు.