హత్య కేసులో నిందితుల అరెస్ట్
నిజామాబాద్ ఫిబ్రవరి13,(నిజం న్యూస్)
ఈనెల 9 వ తేదీ రాత్రి నిజామాబాద్ నగరంలోని హైమది బజార్ రోడ్డు లో నిర్మాణంలో ఉన్న డిప్యూటీ మేయర్ కు చెందిన సెల్లర్లో లభ్యమైన వ్యక్తి మృతదేహం కేసులో మిస్టరీ వీడింది పోలీసులు నిర్ధారించారు అరెస్టు చేశారు దీనికి సంబంధించిన నిజమాబాద్ ఏసిపి ఆరే వెంకటేశ్వర్లు వివరాలను శనివారం సాయంత్రం తన కార్యాలయంలో వెల్లడించారు.భవనం సెల్లార్లో మృతదేహం పోలీసులకు సమాచారం ఉండగా అక్కడికి చేరుకున్న పోలీసులు ఒంటిపై గాయాలు ఉండటంతో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మృతుడినీ కిల్ల రోడ్డు లోని మహ్మదీయ కాలనీకి చెందిన కైసర్ గా గుర్తించారు లోతుగా దర్యాప్తు చేపట్టగా సెల్ఫోన్ దొంగగా భావించి భవనంలో పనిచేసే కూలీలు కర్రలతో దాడి చేసి హత్య చేసినట్లు తేలింది. మహారాష్ట్రకు చెందిన రాజేష్ కుహరే,రవీంద్ర కావే, జితేందర్ కుమార్ వార్ ను అరెస్ట్ చేసినట్లు వెంకటేశ్వర్లు తెలిపారు, కాగా ఈ కేసు చేదనలో కీలకంగా వ్యవహరించిన ఎస్.హెచ్.వో విజయ్ బాబు,ఎస్సై, ఏ
ఎస్ఐ గంగాధర్,సిబ్బంది వంశీ,సాయన్న,శ్రీనివాస్ బృందాన్ని ఏసిపి అభినందించారు