విద్యుత్ షాక్ తో మహిళ మృతి
ఆత్మకూర్ ఎస్ ఫిబ్రవరి13(నిజం న్యూస్): ప్రమాదవశాత్తు విద్యుత్ విద్యుత్ షాక్ తో మహిళ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఏపూరు గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన దేషోజు ధనమ్మ (50) ఇంట్లో నీటి హౌస్ పై ఉన్న మోటార్ వైరు తేలి ఉండటంతో అట్టి కరెంట్ వైరు కాలుకు తగలడంతో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందింది. మృతురాలికి భర్త ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నాడు.