Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అంబులెన్స్ కు కరోనా నా ? జ్వరమా..!

 

అంబులెన్స్ నడుపుటకు ప్రత్యేక నిధులు లేకపోవడంతో దవాఖానా లోనే పడకేసిన వైనం.

తుంగతుర్తి ఫిబ్రవరి 13 నిజం న్యూస్.

తుంగతుర్తి నియోజకవర్గం లోని ప్రజలకు, మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నాటి పార్లమెంటు సభ్యులు, డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, అకుంఠిత దీక్షతో, ఈ ప్రాంత పేద ప్రజలకు, తన వంతు మెరుగైన వైద్య సాయం చేయాలనే లక్ష్యంతో, పట్టుదలతో, 25 లక్షల వ్యయంతో కూడిన, ఆధునిక వైద్య పరికరాలతో, అత్యవసర సేవల నిమిత్తం , ఎంపీ నిధుల ద్వారా, అంబులెన్సులు రూపొందించి కొన్ని రోజులు ప్రజలకు సేవలందించారు .కానీ కాలక్రమేణా ఈ అంబులెన్స్ నడవడం కోసం కావలసిన డీజిల్ ఖర్చులు, ప్రభుత్వ నిధుల నుండి పూర్తిస్థాయిలో రాకపోవడంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా దవాఖానాల్లో పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో దవాఖాన అధికారులు స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ దృష్టికి తీసుకోగా, జిల్లా కలెక్టర్ ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేయించారు. రోజులు గడుస్తున్న కొద్దీ, నిధులు ఖర్చయిపోయాయి. ప్రస్తుతం రోగుల పరిస్థితుల దృష్ట సర్వీస్ తిరగాలంటే తప్పనిసరిగా డిజిల్ కావాల్సిందే.. డీజిల్ ఖర్చుల నిధులు లేకపోవడంతో… ఏకంగా అంబులెన్స్ జ్వరమా… కరుణ లాగా… తుంగతుర్తి దవాఖాన లో పడక వేయడం గమనార్హం…. ఇకనైనా జిల్లా నుండి నిధులు వస్తాయో. లేక.. తమ ప్రాణాలు గాలికి పోవాల్సిందే నా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు