పయనమైన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ సహ దేవతల పల్లకీలు

కృష్ణా, ఫిబ్రవరి 12, (నిజం న్యూస్)
చరిత్రలో కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచిన శ్రీ గోపయ్య స్వామి సమేత, శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రంగుల మహోత్సవం నకు జగ్గయ్యపేట విచ్చేస్తారు. అందులో భాగంగా శనివారం రోజున గత పదిహేను రోజులు అమ్మవారి రంగుల మహోత్సవం మండపంలో రంగుల మహోత్సవ కార్యక్రమాలు పూర్తి చేసుకొని భక్తులకు దర్శనమిచ్చి నేడు అమ్మవారు రంగుల మహోత్సవం మండపం నుండి పెనుగంచిప్రోలు పట్టణానికి బయలుదేరారు. ఈ వైభవాన్ని చూడటానికి తండోప తండాలుగా భక్తులు తరలివచ్చారు. భక్తులు ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు, రెవెన్యూ ,ఆలయ సిబ్బంది తో సకల ఏర్పాట్లు ఈవో చేశారు .ఈ జాతరను చూడటానికి తెలంగాణ ,ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాల నుండి సుమారు ఐదు జిల్లాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. భక్త జన సముద్రంచే నేల ఈనిందా అమ్మవారి భక్తులతో అన్నట్లు రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. భక్తులందరూ అమ్మవారికి బోనాలు , కోళ్లు, వేటలతో మొక్కులు చెల్లించుకున్నారు.