చలి వాగు ప్రాజెక్ట్ చెరువును పర్యటక హబ్ గా తీర్చిదిద్దాలి

జయశంకర్ భూపాలపల్లి అవిభాజ్య వరంగల్ జిల్లా ప్రస్తుత హన్మకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి వద్ద చలివాగు ప్రాజెక్ట్ చెరువు ఇది నేరెడుపల్లి, దొంగల(ప్రగతి) సింగారం, పత్తిపాక, హుస్సేన్ పల్లి,మైలారం,వసంతపురం, కొప్పుల,జోగంపల్లి,పెద్ద కోడెపాక శివారుల గ్రామాల భూములను ఆవరించి ఉంది.
కృష్ణా, గోదావరి రెండు నదుల బేసిన్ లోని నీళ్ళు రెండు నదుల్లోకి ఎడమకాలువ ద్వారా కృష్ణా,గోదావరి నదుల్లో కలుస్తాయి. జోగంపల్లి చలి వాగు ప్రాజెక్ట్ చెరువు నుండి దొంగల (ప్రగతి)సింగారం 8 కిలో మీటర్ల దూరం వరకు ఉయ్యాల వంతెన నిర్మించాలి. అన్ని అర్హతలు కలిగి ఉన్న జోగంపల్లి చలి వాగు ప్రాజెక్ట్ చెరువును పర్యటక హబ్ గా గుర్తించి, తీర్చిదిద్దాలి.పచ్చని పొలాలు, నిండు కుండలా ఉండి ప్రకృతి అందాలు రమణీయం.
సహజసిద్ధమైన వాతావరణంలో పర్యాటకులను మై మరిపిస్తాయి. జోగంపల్లి సమ్మక్క- సారలమ్మ జాతర,పర్యాటకులను ఆకట్టుకుని,కనువిందు చేస్తాయి. సందర్శించడానికి రెండు జాతీయ మరియు గ్రామీణ రహదారులు ఉన్నాయి. జాతీయ రహదారి 353 సి గుడెప్పాడు క్రాస్ ( ఆత్మకూరు) – పరకాల నుండి, మందారిపేట ( తహరాపూర్) – శాయంపేట నుండి, గోవిందాపురం క్రాస్ నుండి, పెద్దకోడేపాక క్రాస్ నుండి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా జాతీయ రహదారి రేగొండ మండలం రేగొండ పోలీస్ స్టేషన్ జంక్షన్ వయా గోరి కొత్తపల్లి నుండి, రూపిరెడ్డిపల్లి వయా కొప్పుల నుండి, జాతీయ రహదారి 163 ములుగు జిల్లా జాకారం వయా అబ్బాపురం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోనరావుపేట క్రాస్,గోరి కొత్తపల్లి, రాజక్కపల్లి నుండి, ములుగు జిల్లా మల్లంపల్లి వయా కాట్రపల్లి నుండి, హౌజ్ బుజూర్గ్ వయా దొంగల ( ప్రగతి) సింగారం నుండి, నీరుకుళ్ళ క్రాస్ – పత్తిపాక నుండి, ఆత్మకూర్ – జోగంపల్లి రహదారుల ద్వారా చలి వాగు ప్రాజెక్ట్ చెరువుకు సులువుగా చేరుకోవచ్చు.ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే,జిల్లా కలెక్టర్ స్పందించి,నిధులు కేటాయించి, పర్యాటక హబ్ గా గుర్తించి, అభివృద్ధి చేj