మహా శివరాత్రి కి ముమ్మర ఏర్పాట్లు
మహాశివరాత్రి కి ముమ్మర ఏర్పాట్లు
చర్ల ఫిబ్రవరి 12 (నిజం న్యూస్) మండల పరిధిలోని తేగడ గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో మార్చి1వ. నా జరగనున్న మహాశివరాత్రికి యల్లమంద ల వంశీయులు. శ్రావణ్ కుమార్. భానుప్రకాష్ . దాతలు. గ్రామస్తులసహ కారంతోశనివారం ముమ్మర ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భద్రకాళీ సమేత వీరభద్రస్వామి కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు సతీష్ గడ్ ఒరిస్సా మధ్యప్రదేశ్ ఖమ్మం జిల్లాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరు కానున్నారు స్వామివారికి గోటితో వలసిన బియ్యం తేవటం ఆనవాయితీ.నారసార సంబరాలు.భక్తి శ్రద్ధలతో భక్తులు దవడలకు నాలుకకుఇనుప శూలాలను గుచ్చుకొని స్వామివారి ముందు దు నృత్యాలు చేయడాన్ని తిలకించేందుకు కు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. స్వామి వారి అనుగ్రహంతో భక్తులు అగ్ని గుండం లో( నిప్పుల్లో) నడవడం . వివిధ గ్రామాల నుండి ట్రాక్టర్లు. ఎడ్లబండ్ల పై వీర ప్రభలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు.