వాహన కిరాయి రూ.8 లక్షలు వెంటనే చెల్లించాలి

రైతుల రూ.8లక్షలు వెంటనే చెల్లించాలి
కాలయాపన చేస్తున్నారు అని ఆరోపణ
సంఘం ముందు రైతులు ధర్నా
నేరేడుచర్ల, ఫిబ్రవరి 12 ( నిజం న్యూస్ )
నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్న గ్రామం లోసహాకార సంఘం ధ్వారా రైతుల వద్ద ఖరీదు చేసిన ధాన్యంను రైతులకు రావాల్సిన వాహన కిరాయి ఖర్చులు మరియు 2019 – 20, 2020 – 21 2021 – 2022 సంవత్సరాల నుండి 8 లక్షల రుాపాయలు ఖరీఫ్ రబీలో వ్యాపారం చేసిన అధికారులు రైతులకు ఇవ్వకుండా కాలయాపన చేస్తుా పబ్బం గడుపుతన్నారని రైతులు నిరసనతో ఆవేధన వ్యక్తం చేశారు.
ఇట్టి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల యస్.సి.సెల్ అధ్యక్షులు వుాట్కుారి సైదులు మరియు నాయకులు సిద్దపంగ రాములు సంఘీబావం తెలిపినారు.
ఈ సందర్భంగా వుాట్కుారి సైదులు మాట్లాడుతుా రైతులకు ట్రాన్పోర్ట్ కిరాయిలు మరియు పురికోస , మరియు హమాలీ మెుత్తం వ్యాయం సుమారు 8 లక్షల రుాపాయలు వెంటనే రైతులకు చెల్లించి రైతులకు సరైన న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇట్టి ధర్నాలో బాద్యులైన రైతులు యల్లబోయిన వెంకటి , పెరుగు నాగరాజు , వల్లంశెట్ల వెంకటేశ్వరరావు, అలవాల శ్రీధర్, పెండెం సైదులు, కట్ట సుధాకర్ , దిగుమతి శ్రీనువాస్ , బత్తిని సుధాకర్ , సత్యం, కట్ట శ్రీను , సక్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.