Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

టీఆర్‌ఎస్‌, బీజేపీల.. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ..!

 రాష్ట్రంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ ను వదిలి బీజేపీపైనే విమర్శలు
 మోడీ పేరును పదేపదే జపిస్తున్న సారు
 బీజేపీని విమర్శించి తెలంగాణాలో
 పార్టీ బలం పెంచాలని వ్యూహం
 కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు
రేవంత్‌ను ఎదగనీయని సీనియర్లు
 అవకాశాన్ని ఉపయోగించుకుని
కేసీఆర్‌ తో కలిసి ప్లాన్‌ చేస్తున్న బీజేపీ
 కాంగ్రెస్‌ ను కోలుకోకుండా దెబ్బకోట్టాలనే ఆలోచన

(జర్నలిస్టు క్రాంతి ప్రత్యేక కథనం)

రాష్ట్రంలో రాజకీయాలను చూస్తుంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీపై కేసీఆర్‌ యుద్ధం చేస్తన్నట్టుగా, రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు పోరాటం చేస్తున్నట్టుగా పైకి కనపడుతుంది.

నిన్నా మొన్నటి వరకు కేంద్రంతో అంటకాగిన కేసీఆర్‌, బిల్లుల పాస్‌ కోసం టీఆర్‌ఎస్‌ సాయం కోరిన బీజేపీ లు ఉన్నట్టుండి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటంపై ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి. మోడీ ప్రభ రోజురోజుకు తగ్గుతున్న క్రమంలో ప్రాంతీయ పార్టీలు, కలిసి వచ్చే పార్టీలను మోడీ దూరం చేసుకోడు కదా ఈ సమయంలో ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్దంపై ప్రజల్లో అపోహలు పెరుగుతున్నాయి.

కేసీఆర్‌ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో కేసీఆర్‌ నయా ప్లాన్‌ కు తెరతీశారు. బీజేపీ టీఆర్‌ఎస్‌ మ్యాచ్‌ పిక్సింగ్‌ చేసుకుంటూ కాంగ్రెస్‌ ను రాష్ట్రం, దేశంలో అధికారంలోకి రాకుండా చేయాలనే ప్లాన్‌ చేస్తున్నారు అనే అనుమానాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా కేసీఆర్‌, బండి సంజయ్‌ తీరు ఉన్నది.
మోడీతో కలిసి..
రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వానికి, దేశంలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్న క్రమంలో ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్‌ ను అన్నీ రాష్ట్రంల్లో దెబ్బతీస్తున్న మోడీ తెలంగాణలో ఆ పార్టీని దెబ్బకొట్టాలని కేసీఆర్‌ తో కలిసి వ్యూహ రచన చేస్తుండు అనే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో ఎదుగుతున్న కాంగ్రెస్‌ ను ఇబ్బందులు పెట్టడానికి వ్యూహ రచన చేశారు. దీనిలో భాగంగానే వడ్ల వివాదం తెరపైకి తీసుకొచ్చి కావాలనే రాష్ట్రంలో బీజేపీ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌ అనేలా వాతావరణం సృష్టించారు.

దీంతో కొన్ని మీడియా సంస్థలు రాష్ట్రంలో బీజేపీ బలపడుతోంది, కేసీఆర్‌ ను బీజేపీ నాయకులు మాత్రమే బలంగా విమర్శిస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ కు బీజేపీ యే ప్రత్యామ్నాయమంటూ ఉదరగొట్టారు. అధికారం కోసం తమపైనే ఎదుటి వారితో విమర్శలు చేసుకుంటున్న తీరును ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు తప్పుపడుతున్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ ల ఆలోచన రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనంగా బావిస్తున్నారు.
రాష్ట్రంలోని సమస్యలను పక్కన పెట్టి బీజేపీపై విమర్శలు
అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్‌ మీట్‌ లు పెడితే అభివృద్ది పనుల గురించి మాట్లాడుతాడు, రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సమాధానం ఇస్తాడు. రాష్ట్రంలో ఎప్పటి నుంచో పరిష్కారం కానీ సమస్యల గురించి మాట్లాడటమో లేక తాను ఏం చేయబోతున్నాడో చెప్పుతాడు. కానీ కేసీఆర్‌ మాత్రం వాటికి సమాధానం చెప్పకుండా మోడీని కావాలని లాగి బీజేపీకి ప్రచారం కల్పించటం అలవాటుగా చేసుకుండు.

దీనీపై మళ్లీ బీజేపీ వాళ్లు ధర్నాలు, రాస్తారోకోలు చేయటం లాంటివి చేయటం వాటికి టీఆర్‌ఎస్‌ వాళ్లు కౌంటర్లు ఇవ్వటం చేస్తున్నారు. దీంతో బీజేపీ వాళ్లు నిత్యం మీడియాలో ఉంటున్నారు. మళ్లీ వారి సొంత మీడియా తో కేసీఆర్‌ ప్రభుత్వానికి బీజేపీనే ప్రత్యామ్నాయం అనేలా ఊకదంపుడు స్టోరీలు అల్లటం చేస్తున్నారు.

సంస్థాగతంగా టీఆర్‌ఎస్‌ కంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉంటుందనే అందరికీ తెలిసిన విషయమే. అయితే కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలుకు సమాధానం ఇవ్వకుండా కావాలనే మోడీని తిడుతూ బీజేపీకి సీఎం కేసీఆరే ప్రచారం అవకాశం కల్పిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
కాంగ్రెస్‌ లో అంతర్గత కుమ్ములాటలే అవకాశంగా..
కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి నియామకం అయిన మొదట్లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరిగిన అనేక కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. దీంతో కాంగ్రెస్‌ బలం పెరగుతుంది అనుకున్నారు అంతా. కానీ రేవంత్‌ కు వ్యతిరేకంగా ఆ పార్టీలోని సీనియర్లు అంతా ఆయనకు సహకరించటం మానేశారు. దీంతో ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అయినా ఒంటరి అయినట్టు అయ్యారు.
కార్యక్రమాలు ఏమి చేసినా సీనియర్ల నుంచి విమర్శలు రావటంతో రేవంత్‌ రెడ్డి కాస్త తగ్గాడు. ఇదే అదునుగా భావించిన కేసీఆర్‌ మోడీతో కలిసి కాంగ్రెస్‌ ను కానరాకుండా చేసే చర్యలు చేపడుతున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ను ఎదగనీయకుండా చేయాలని బీజేపీ, టీఆర్‌ఎస్‌ అధినాయకత్వాలు ప్లాన్‌ చేస్తున్నాయి. కేసీఆర్‌ కు ఉపయోగం ఏమిటీ
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ను దెబ్బకొట్టి బీజేపీని ప్రత్యా మ్నాయం అని ప్రజలు అనుకునేలా చేయటం వల్ల కేసీఆర్‌ కు లాభం ఏంటనే ప్రశ్న సగటు ప్రజల్లో సందేహం వస్తుంది. అయితే కేసీఆర్‌ కు జరిగే మేలు అంతా ఇంత కాదు. రాష్ట్రంలో కేసీఆర్‌ కు అంతే స్థాయి లో కౌంటర్‌ ఇయ్యాలంటే రేవంత్‌ వల్లనే సాధ్యం అనేది ప్రజల్లో ఉన్న బావన.

అయితే రేవంత్‌ అధ్యక్షుడిగా ఉన్న కాంగ్రెస్‌ అసలు పోటీలో లేదు అని ప్రచారం చేయటం వల్ల కాంగ్రెస్‌ కు ఓటు బ్యాంకు తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో మతతత్వ ముద్ర ఉన్న బీజేపీకి ఓటు వేయటానికి రాష్ట్రంలోని ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడు తున్నారు. ఒకవేల వేసినా కాంగ్రెస్‌, బీజేపీ మధ్య ఓట్లు చీలి మళ్లీ తానే అధికారంలోకి రావాలనే ఆలోచనలో కేసీ ఆర్‌ ఉన్నారు అని మేదావులు అభిప్రాయపడుతున్నారు.
మరి మోడీకి జరిగే లబ్ధి ఏమిటీ
కాంగ్రెస్‌ లో సరైన ప్రతిపక్షనాయకుడు లేక పోవటం వల్ల రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ, మూడో సారి అధికారంలోకి రాకుండా మమత, స్టాలిన్‌, కమ్యునిస్టులు, కాంగ్రెస్‌ విడివిడిగా పని చేస్తున్నారు. అయితే ఎన్నికల సమయానికి అందరు కలిసి మోడీ చేస్తున్న ప్రజావ్యతిరేక పాలనను ప్రజలకు వివరించితే గతంలో కన్నా ఇసారి చాలా తక్కువగా సీట్లు వచ్చే అవకాశం ఉంది. దీంతో టీఆర్‌ఎస్‌ లాంటి స్థానిక పార్టీలను ఇప్పటి నుంచే దువ్వుతున్న మోడీ అప్పటికి వాటితో కలిసి వారికి మంత్రి పదవులు ఇచ్చి ప్రబుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ప్లాన్‌ లో ప్రధాని మోడీ ఉన్నారు.