Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

యాదాద్రికి వెళ్తూ వ్యక్తి మృతి

యాదాద్రికి వెళ్తూ వ్యక్తి మృతి.. …….

ఆలస్యంగా వెలుగులోకి…..

 

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 12 (నిజం న్యూస్)

భువనగిరి రూరల్ బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు గ్రామానికి చెందిన కుమ్మరి శివరాజ్ (30) యాదగిరిగుట్టకు దర్శనానికి వెళుతూ మల్లాపురం గ్రామ శివారులో బైక్ అదుపు తప్పి పడిపోయాడు. శనివారం ఉదయం పశువుల కాపరి చూసి పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వ్యక్తి మరణించినట్టు నిర్ధారించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.