*మేంటెన్స్ పేరుతో రెన్యువల్ చేసుకుంటున్న టోల్ యాజమాన్యం.*
*బ్రిడ్జి నుండి టోల్ గేట్ వరకు దరిద్రంగా తయారై ఇబ్బంది పడుతున్న వాహనదారులు.*
*పట్టించుకోని టోల్ గేట్ వసూలుదారులు, ఆర్&బి అధికారులు.*
మిర్యాలగూడ ఫిబ్రవరి 12 (నిజం న్యూస్):
మిర్యాలగూడ కోదాడ రూట్ లో ఉన్నాం చిల్లెపల్లి బ్రిడ్జి టోల్గేట్ ఎన్నో ఏళ్లుగా వసూలు చేస్తున్నారు. వారి టైం అయిపోయిన మెయింటెనెన్స్ పేరుతో రెన్యువల్ చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది.
బ్రిడ్జి నుంచి టోల్ గేట్ వరకు రోడ్డు అధ్వానంగా తయారైంది కొన్నేళ్లుగా ఇలా అధ్వానంగా తయారైన రోడ్డుని ఏనాడు మరమత్తు చేయని టోల్ గేట్ యాజమాన్యం, వసూలు చేయడానికి మాత్రం అధికారులతో మాట్లాడుకుని,లొసుగులను ఉపయోగించుకొని టోల్ గేట్ రుసుం వసూలు చేస్తూనే ఉన్నారు, మెయింటెనెన్స్ చేయకుండా బిడ్జీ ఇరువైపులా దరిద్రంగా తయారైన రోడ్డుని వేయకుండా టోల్ గేట్ వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. రోడ్డు మరమ్మతులు చేయకుండా టోల్ గేట్ వారు రుసుం వసూలు చేస్తున్నా సంబందిత ఆర్అండ్ బి అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు, దీంతో ఆర్అండ్ బి అధికారులు పై కూడా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా టోల్ గేట్ యాజమాన్యంతో మాట్లాడి ఇరువైపులా మరమ్మతులు రోడ్డుపై ఒక లేయరు వేయించ వలసిందిగా వాహనదారులు ఆర్ అండ్ బి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
కోదాడ జడ్చర్ల రోడ్డు డబల్ రోడ్డు పనులు జరుగుతూనే ఉన్నాయి,అవి దాదాపు పూర్తి కావస్తున్నాయి, ఈ టోల్ బ్రిడ్జి కూడా వారి కిందికి వస్తుంది. ఆయిన ఈ టోల్ వసూలు చేయడం మరమ్మతులు చేయకుండా వసూలు చేయడం ఎంతవరకు సమంజసం? ఈ యొక్క విషయాన్ని ఆర్అండ్ బి అధికారులు సీరియస్ గా తీసుకోవాలని వాహనదారులు విన్నవిస్తున్నారు.
*టోల్ గేట్ యాజమాన్యంతో వాహనదారులు స్కూల్ టైం అయిపోయింది అంటూ తరచూ గొడవలు*
చిల్లేపల్లి బ్రడ్జి టోల్ గేట్ యాజమాన్యంతో వాహనదారులు, మీ టోల్ రుసుము టైం అయిపోయిన వసూలు చేస్తున్నారంటూ తరచూ టోల్ గేట్ వారితో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి.ఒకవేళ కాకపోతే టోల్ టై అయిపోక పోతే మరి ఎందుకు మరమ్మత్తులు చేయడంలేదని ప్రశిస్తున్నారు. వాహనదారులతో టోల్ గేట్ వారి సిబ్బంది అడ్డగోలుగా మాట్లాడుతూ వివాదం చేస్తున్నారని, వాహనదారులు తమ సందేహాన్ని వారితో వ్యక్తం చేసినప్పుడు సరైన సమాధానం చెప్పకుండా వాహనదారులతో గొడవ పడుతున్నారు.
బ్రిడ్జి ఇరువైపులా రోడ్ వేయకపోతే టోల్గేట్ వద్ద నిరసన వ్యక్తం చేస్తామని లైట్ మోటర్స్ వాహనాల నాయకులు తెలిపారు.