సుబ్బంపేట అడవిలో పులి సంచారం

– ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. రేంజ్ అధికారి ఉపేంద్ర

చర్ల ఫిబ్రవరి 11 (నిజం న్యూస్) చర్ల మండలంలోని సుబ్బంపేట అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్న సమాచారం ఉందని సుబ్బంపేట గొల్లగూడెం గొల్లగూడెం క్రాంతి పురం బి ఎస్ రామయ్య నగర్ పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చర్ల రేంజ్ అధికారి ఉపేంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు రాత్రి వేళల్లో బయటకు రావద్దని పశువులు ఇంటివద్దనే ఉంచుకోవాలని అడవి. పొదలు ఉన్న ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లవద్దని పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని. ఎవరివైనా పశువులు దాడికి గురయితే ఫారెస్ట్ అధికారులకు తెలియపరచాలని నష్ట పరిహారం అందించడం జరుగుతుందని తెలిపారు పులి జాడ వివరాలు తెలిస్తే తే 9441747300.9100343421.994949865286 నెంబర్లకు తెలియపరచాలని కోరారు. ఎవరైనా హాని తలపెట్టిన ఎడల వారిపై వైల్డ్ లైఫ్ ఆర్ట్ 1972 ప్రకారం నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి చట్ట ప్రకారము చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు