Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గ’లీజు’దారులు..25 సంవత్సరాలుగా మసీద్‌ కాంప్లేక్స్‌లో తిష్ట

– 25 సంవత్సరాలుగా మసీద్‌ కాంప్లేక్స్‌లో తిష్ట
– ఉద్యోగులు, చనిపోయిన వారిపై దుకాణాలు
– 2012లోనే ముగిసిన లీజు గడువు
– 3 శాతం మాతమ్రే పెంచుతామన్నా లీజు దారులు
– పెంచిన అద్దెలు చెల్లించాలని మసీదు కమిటీ నిర్ణయం
– 13 నెలలనుంచి అద్దెలను కట్టడం మానేసిన లీజు దారులు
– వక్ఫ్‌ బోర్డుకు నామమాత్రపు అద్దె
– సబ్‌లీజ్‌ పేరుతో లక్షలు వెనకేసుకుంటున్న వైనం
– కుంటు పడుతున్న ఉస్మానియా మసీద్‌ అభివృద్ధి
– వక్ఫ్‌ ఆదాయానికి భారీ గండి
– మామూళ్ల మత్తులో వక్ఫ్‌ బోర్డు అధికారులు
– వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్న ఇమామ్‌, మౌజన్‌ – 20రోజులుగా ముస్లింల ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనలు

హుజూర్‌నగర్‌ పట్టణంలో ఉన్న ఉస్మానియా మసీద్‌ కాంప్లెక్స్‌ అక్రమార్కులకు బంగారు బాతుగా మారింది. కాంప్లెక్స్‌లో మొత్తం 51 దుకాణాలున్నాయి. వాటిలో గత 25 సంవత్సరాలు నుండి ఒక్కరి పేరు పైనే లీజు కొనసాగుతుండటంతో అనేక అనుమానాలకు తావిస్తుంది. పేదల ముసుగులో దుకాణాలను లీజుకు తీసుకున్న వారు అవే దుకాణాలను అత్యధిక అద్దెలకు సబ్‌ లీజుకు ఇచ్చి లక్షలకు లక్షలు వెనకేసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, చనిపోయిన వారి పేరు మీద దుకాణాలు ఉన్నాయి. లీజు దారులు నామమాత్రపు అద్దెలను వక్ఫ్‌ బోర్డుకు చెల్లిస్తూ లక్షలను ఆర్జిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. దుకాణాల కిరాయిని పెంచుతామని మసీద్‌ కమిటీ వీరికి తెలపగా వీరు 3 శాతం మాత్రమే పెంచి కడతామని లేకుంటే లేదని చెబుతున్నారని కమిటీ సభ్యులు చెబుతున్నారు.

హుజూర్‌నగర్‌ పట్టణంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ కాంప్లేక్స్‌ ఉండటం వారికి వరంలా మారింది. హుజూర్‌నగర్‌లో ఈ ప్రాంతంలో దుకాణాలు అద్దెకు కావాలంటే కనీసం 20 వేల నుండి 25 వేల వరకు చెల్లించాల్సిన పరిస్థితి. కానీ వీరు చెల్లించే అద్దెలు రెండు, మూడు వేలకు మించి లేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. 2012లోనే ఈ దుకాణాలకు లీజుకు కాల పరిమితి ముగిసినదని, ఆ తర్వాత 2021లో మస్జీదు కమిటీ వారు అద్దెలను పెంచుతున్నామని వీరికి చెప్పగా, అప్పటినుండి అంటే గత 13 నెలల నుంచి క్లాంప్లెక్స్‌లో ఉన్న దుకాణాల లీజు దారులు అద్దెలు చెల్లించక పోవడంతో మసీదులో ప్రార్ధనలు నిర్వహించే ఇమామ్‌, మాజన్‌లకు వేతనాలు చెల్లించే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్నారు.
వక్ఫ్‌ బోర్డుకు సంవత్సరానికి రూ. 54 లక్షల గండి…
ఉస్మానియా మసీద్‌ కాంప్లెక్స్‌కు సాధారణ మార్కెట్‌ ధరలపక్రారం చూసుకుంటే 51 దుకాణాలకు ఏడాదికి రూ.60 లక్షల ఆదాయం రావాలి కానీ ఇక్కడ లీజు దారులు చెల్లించే నామమాతప్రు అద్దెలతో ఆదాయం ఏటా రూ. 6లక్షలకు మిచ్చి రావడం లేదు. దీంతో వక్స్‌బోర్డు ఆదాయానికి భారీ గండి పడుతుంది. మసీదు అభివృద్ది కుంటు పడుతుంది .మజీద్‌ కమిటీకి సంబంధించి సుమారు 51 షాపులు ఉన్నా ఒక్కొక్క షాపు 3000 లోపు కిరాయి మాత్రమే కట్టడంతో మెయింటెనెన్స్‌ కష్టంగా ఉందని మస్జీదు కమిటీ సభ్యులు చెబుతున్నారు. ఉస్మానియా మజీద్‌ కాంప్లెక్సులో షాపులు తీసుకున్న ముస్లిం పెద్దలు వాటిని అత్యధిక ధరకు (సుమారు 20వేల నుండి30 వేలు) ఇస్తూ పబ్బం గడుపుకుంటున్నా నిజమైన పేద ముస్లిం లకు షాప్‌ లు దొరికే పరిస్ధితి లేదు. లీజ్‌ దారులలో సుమారు 20 శాతం ఒకే కుటుంబ సభ్యులు కావడం, మరో 20 శాతం మరణించిన వారు ఉండడం అంశంపై ముస్లిం జాయింట్‌ యాక్షన్‌ కమిటీ తరపున గత(20) రోజులుగా వివిధ రూపాలలో అందరి మద్దతుతో పోరాటాలతో తమ నిరసన తెలుపుతున్నారు. 20 రోజులుగా నిరసనలు తెలుపుతున్నా వక్ఫ్‌ బోర్డు అధికారులు స్పందించకపోవడంతో కమిటీ సభ్యులు సీఎం, గవర్నర్‌, మైనార్టీ సంక్షేమశాఖ, హెచార్సీని ఆశ్రయించనున్నామని తెలుపుతున్నారు.

బషీర్‌, హుజూర్‌నగర్‌
బహిరంగ వేలం నిర్వహించాలి.
ఉస్మానియా మసీదు కాంప్లెక్స్‌ లో దుకాణాలకు బహిరంగవేలం నిర్వహించి ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్నా పేద ముస్లింలకు అవకాశం కల్పించాలి.ఎన్నో ఏళ్ల నుంచి దుకాణాలను లీజు దారులు తీసుకొని గడువు ముగిసిన అద్దెలు చెల్లించాక పోయిన వక్స్‌బోర్డు అధికారులు వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం శోఛనీయం .

ముస్తాఫా. హుజూర్‌నగర్‌
వక్స్‌బోర్డు అధికారులు స్పందించాలి.
మసీదు కాంప్లెక్స్‌ లో జరుగుతున్న అకమ్రాలపైన విచారణ జరిపి
అధికారులు స్పందించి ఆదాయం పెంచే విదంగా చర్యలు తీసుకోవాలి.నిరుపేదలకు న్యాయం చేయాలి. మసీదు అభివృద్దికి
సహకరించాలి.