తిరుమలగిరిలో టిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

టిఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు!

 

తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు, పార్టీలో చేరికలు.

 

తుంగతుర్తి ,ఫిబ్రవరి 11 నిజం న్యూస్

 

తిరుమలగిరి పట్టణంలోని ఎమ్మెల్యే గారి నివాసంలో తుంగతుర్తి మండలం ఏనేకుంట తండా, గ్రామానికి చెందిన బానోతు సుందర్,రామచంద్ర,బిచ్చా,సర్వన్ వారితో పాటు 50 మంది నాయకులు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి శుక్రవారం రోజున తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది.

నూతనంగా TRS పార్టీలోకి చేరిన వారిని గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. పార్టీలో చేరిన వారికి ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుందని, టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాడికొండ సీతయ్య జిల్లా నాయకులు గుండ గాని రాములు గౌడ్ కటకం వెంకటేశ్వర్లు ఎస్ టి సెల్ జిల్లా నాయకులు పూర్ణా నాయక్ , విజ్జు నాయక్, తదితరులు పాల్గొన్నారు.