పదివేల రంగులు డబుల్ ఇకట్ తో భారతదేశ పటం, చరఖా
పోచంపల్లి ,బాలయ్య గ్రేట్!
హైదరాబాద్ ఫిబ్రవరి 11 నిజం న్యూస్.
పోచంపల్లికి చెందిన చేనేత కళాకారుడు బోగ బాలయ్య 18 నెలలు కష్టపడి ,పదివేల రంగులను ఉపయోగించి ,డబుల్ ఇకట్ నైపుణ్యంతో భారతదేశ పఠము, మరియు చరఖా వచ్చేటట్లు నేశారు. వీరి ప్రతిభ జాతీయ అవార్డుకు అర్హులు
ఏది ఏమైనా చేనేత రంగంలో రాణిస్తూ, కష్టపడి నైపుణ్యంతో రాణించడం గమనార్హం. ప్రభుత్వం స్పందించి కళాకారుని ఆదుకోవాలని, చేనేత సంఘం కోరుతున్నది. బాలయ్యకు తెలంగాణ ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు..