షెడ్డు నిర్మించ కుండా నిర్మించినట్లు గా బిల్ ఎత్తిన కాంట్రాక్టర్

ప్రయివేట్ ప్లాంట్లపై ఆధారపడుతున్న గ్రామస్తులు
షెడ్డు లేకుండా వాటర్ ప్లాంట్ మిషన్లు ఇచ్చి 12లక్షల బిల్లు ఎత్తిన కాంట్రాక్టర్
షెడ్డు నిర్మించ కుండా నిర్మించినట్లు గా బిల్ ఎత్తిన కాంట్రాక్టర్
నేరేడు చర్ల, ఫిబ్రవరి 10, ( నిజం న్యూస్ )
నేరేడు చర్ల మండలం పరిధిలో నీ మేడారం పెద్దగ్రామపంచాయతీ గ్రామ పంచాయతీ మెయిన్ రోడ్డుపై వున్నటువంటి వాటర్ ప్లాంట్ లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన వాటర్ ప్లాంట్ నిరుపయోగంగా
మారిన పట్టించుకునే నాధుడే కరువయ్యారు. వివరాల్లోకి వెళితే మేడారం
గ్రామపంచాయతీ లో ఎంపీ నిదుల నుండి రూ.లు 12లక్షలు వెచ్చించి నిర్మించినవాటర్ ప్లాంటు నిరుపయోగంగా మారి 3సం. రాలు కావస్తోంది. షెడ్డుతో కలిపి12 లక్షలు మంజూరుఅయ్యాయి కానీకాంట్రాక్టర్ షెడ్డు లేకుండా మిషన్లు ఇచ్చి షెడ్డును నిర్మించకుండా నిర్మించినట్లు డబ్బులు దారి మళ్ళించాడు . షెడ్డు లేకపోవడంతో వాటర్ ప్లాంట్ పై నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది.దీంతో దాదాపు 5 వేలకు పైగా జనాభా కలిగిన మేడారం గ్రామ ప్రజలు మంచినీళ్ల కోసం ప్రయివేట్ వాటర్ ప్లాంట్లపై ఆధారాపడుతున్నారు.కొద్దికాలం పంచాయతీ ఆధ్వర్యంలోనిర్వహించినప్పటికీ స్థానికంగా ఉన్న ఆర్థిక కారణాలతో నిర్వహణ బాధ్యతను
అనంతరం వేరే వ్యక్తికి అప్పగించారు. అయన కూడా చేతులేత్తేశాడు. దాంతో గ్రామ పంచాయతీ ఆవరణలో ఉన్న వాటర్ ప్లాంట్
నిరుపయోగంగా మారింది. ఆవరణలో ఉన్న వాటర్ ప్లాంట్ ను ప్రజలకు ఉపయోగంలోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.
గ్రామ సర్పంచ్ స్వాతి వివరణ:
వాటర్ ప్లాంట్ నిరుపయోగంగా ఉన్న మాట వాస్తవమే కాని ఈ నెల రోజుల్లో రిపేరు చేయించి ఉపయోగంలోకి తెస్తాము అని అన్నారు.