రెండు బైక్ లు ఢీకొని ,ముగ్గురు యువకుల మృతి.

రెండు బైక్ లు ఢీకొని ,ముగ్గురు యువకుల మృతి.
ఆత్మకూరు ఎస్ మండలం నశింపేట వద్ద ఘటన.
అతి అతివేగమే ప్రమాదం అంటున్న పోలీసులు.
ఆత్మకూరు ఎస్, ఫిబ్రవరి 11 నిజం న్యూస్.
ఆత్మకూర్ ఎస్ మండలం , నసీం పేట వద్ద ఎదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొని, ముగ్గురు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం,మృతులు బానోతు అరవింద్ (తెట్టేకుంట తండా), బుక్య నవీన్(బోత్యా తండా), దరవత్ ఆనంద్ (లక్ష్మీ నాయక్ తండా) చెందిన వారుగా తెలుపుతున్నారు.ఏపూరుతండా కు చెందిన వినేశ్ కు తీవ్ర గాయాలు- హైదరాబాద్ కు తరలించినట్టు గా తెలుపుతూ, జరిగిన సంఘటనపై పోలీసులు పూర్తి విచారణ జరిపి, కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి దారి తీసినట్లు పేర్కొన్నారు.
మృతులంతా ఇరవై రెండేళ్ల యువకులే. వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.