రిపోర్టర్ కుటుంబాన్ని పరామర్శించిన బీర్ల అయిలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 10 (నిజం న్యూస్)
క్రైమ్ మిర్రర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తల్లి చింతకింది కమలమ్మ ఇటీవల ఆకస్మికంగా మృతి చెందారు. గురువారం ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బీర్ల అయిలయ్య ఆలేరు లోని సిల్క్ నగర్ లో ని తన నివాసాన్ని సందర్శించి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించి, జిల్లా స్టాపర్ కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆకస్మిక మృతి కుటుంబానికి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడున్నర సంవత్సరాలుగా తన భర్త అయిన వాసుదేవ్ కు సేవలు అందించి సుమంగళి గా మృతి చెందడం బాధాకరమని అన్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలేరు పట్టణ అధ్యక్షుడు ఎం ఏ ఏజాజ్, సింగిల్ విండో డైరెక్టర్ కట్టేకొమ్ముల సాగర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి జైన్ ఉద్దిన్, కర్రె అజయ్, పర్రే రమేష్, జాంగిర్, భీమ గాని ప్రభు, కలకుంట్ల లోకేష్ ,బీసీ కిరణ్, md బాబా పూర్ణచందర్ , అందే అఖిల్, కాసుల భాస్కర్, శ్రీను, గ్యార రమేష్, తదితరులు పాల్గొన్నారు.