Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఖమ్మం జిల్లాలో వివాహిత ఆత్మహత్య యత్నం

*ఖమ్మం జిల్లాలో దారుణం వివాహిత ఆత్మహత్య*

ఖమ్మం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 10 నిజం న్యూస్

ఖమ్మం రూరల్లో వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది . పోలీసులు , స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం .. రూరల్ మండలం ఏదులాపురం బైపాస్ రోడ్డు పక్కన గల సింహద్రినగర్ లో బాజీ తన భార్య నాగమల్లేశ్వరితో పాటు నివాసం ఉంటున్నారు . బాజీతో నాగమల్లేశ్వరి ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి మరి వివాహం చేసుకుంది . గత కొన్ని రోజులుగా భర్తతో పాటు చిట్టిబాబు , ఉమాకుమారి , రాధమ్మ , శివనాగదుర్గతో పాటు వెంపటి రవి , నారపాటి రమేష్ కరుణలు చిత్రవద చేస్తున్నారని , తన భర్త వారి మాటలు విని తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని లేఖలో పేర్కొంది . తన భర్తతో పాటు పై వాళ్ల వేధింపులు తాళలేకనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు లేఖలతో పేర్కొనడంతో పాటు ఓ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.తాను చనిపోయిన తర్వాత తన పేరు మీద ఉన్న ఆస్తి , తన భర్త ఆస్తి , బీమా సొమ్ము మొత్తం తన ఇద్దరు కొడుకులకు చెందాలని లేఖలో రాసింది . బాధితురాలు రాసిన లెటర్ కలిచివేసింది . విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నాగమల్లేశ్వరిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ శంకర్రావు తెలిపారు.